“భారత ఎన్నారై” కి….14 ఏళ్ల జైలు శిక్ష…!!!

అమెరికాలో ఉండే ఎంతో మంది తెలుగు వాళ్ళు తమ తమ స్వశక్తితో స్థానికంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఆర్ధికంగానే కాకుండా రాజకీయంగా కూడా ఉన్నత స్థానాలని అధిరోహించారు. తెలుగు వాళ్లకి అమెరికాలో వివిధ ప్రాంతాలలో ఎంతో గౌరవం కూడా ఇస్తుంటారు. అయితే కొంతమంది దుశ్చర్యల కారణంగా తెలుగు వారి పరువుని పోగొడుతున్నారు ఇలాంటి సంఘటనే న్యూజిలాండ్‌లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే…
2003 జరిగిన ఓ ఘటనకి తాజాగా ఓ భారతీయుడికి అమెరికా కోర్టు 14 ఏళ్ళు జైలు శిక్ష విధించింది.  పదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన కేసులో కరీంనగర్‌కు చెందిన సీతారామారావు సల్వాజికి కోర్టు  జైలు శిక్ష విధించడం సంచలనం సృష్టిస్తోంది.  ఘటన జరిగిన 16 ఏళ్ల తరువాత సీతారామారావు కి శిక్ష పడటంతో బాలిక తల్లి తండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.   సీతారామారావు సల్వాజి 19 ఏళ్ల కిందట ఉద్యోగరీత్యా న్యూజిలాండ్‌కు వెళ్లారు. ఆక్లాండ్‌లో మౌంట్‌ఎడెన్‌ జైలు కరెక్షన్‌ శాఖలో ఉద్యోగం సంపాదించారు. అప్పట్లో స్థానికంగా ఉండే బాలికపై అత్యాచారం  చేశాడు. ఈ విషయం ఆ బాలిక తన తల్లి తండ్రులకి  2017లో చెప్పడంతో వారు న్యూజిలాండ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటినుంచీ  అక్కడి పోలీసులు విచారణ జరపగా  కోర్టులో వాదోపవాదాలు విన్న జడ్జి డౌన్‌, సీతారామారావుకు 14 ఏళ్ల శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *