అమ్మాయిల్లో ఈ లక్షణాలు లేనివాళ్ళని చేసుకుంటేనే బెటర్…

ప్రతీ మనిషికి పెళ్లి అనేది జీవితంతో మరిచిపోలేని ఘట్టం. ప్రతీ అబ్బాయిలో తను చేసుకోబోయే  అమ్మాయి ఎలా ఉండాలనే ఊహలు, అభిప్రాయాలు ప్రతి ఒక్కరికీ ఉంటాయి. జీవితంపై అవగాహన కలిగిన,మంచి అమ్మాయి భాగస్వామిగా దొరికితే అంతకంటే భాగ్యం మరొకటి ఉండదు. అయితే జీవితం ఎటువంటి గొడవలు లేకుండా సాఫీగా సాగాలంటే ఎలాంటి అమ్మాయిలను అస్సలు పెళ్లి చేసుకోకూడదో చాణక్యుడు ఇలా చెప్పాడు..

1.సౌందర్యానికి ఎక్కువ  ప్రాధాన్యమిచ్చే అమ్మాయిలు:
అమ్మాయిల్లో అందాన్ని చూసుకుని విర్రవీగే వాళ్ళని  నిర్మొహమాటంగా తిరస్కరించాలని చాణక్యుడు చెబుతున్నాడు. వారు తమ అందానికి ఇచ్చే ప్రాధాన్యం చుట్టూ ఉండే కష్ట సుఖాలకు ఇవ్వరట. పైకి కనపడే  అందం కన్నా మానసిక అందం కలిగిన అమ్మాయిలను మాత్రమే వివాహ మాడాలని

 2.కుటుంబ నేపథ్యం సరిగ్గాలేని అమ్మాయిలు:
కుటుంభ భాద్యత తెలియని వాళ్ళు,  కుటుంబ నేపథ్యం సరిగ్గా లేకున్నా పెళ్లి తర్వాత కష్టాలు తప్పవట. పెళ్లయిన కొద్ది రోజులకే వేరు కాపురం గురించి పోరు పెట్టవచ్చట. అత్త మామల పట్ల అమర్యాదగా ప్రవర్తించవచ్చు.

3.అబద్ధాలు మాట్లాడే అమ్మాయిలు:
అబద్ధాలు చెప్పే అమ్మాయిలను పెళ్లాడవద్దని చాణక్యుడు చెప్పాడు.అమ్మాయిల ప్రవర్తన తీరు తీక్షణంగా గమనిస్తే ఆమె మీతో ఎంత నిజాయితీగా ఉందో ఇట్టే తెలిసిపోతుంది. ఎందుకంటే పెళ్లయిన తర్వాత కూడా రకరకాల అబద్ధాలు చెప్పి కుటుంభంలో కలహాలు  తీసుకరావొచ్చు.

4.విశ్వాసం,నిజాయితీ  లేని అమ్మాయిలు:
నిజాయితీ,విశ్వాసం లేని అమ్మాయిలను పెళ్లి చేసుకోవద్దని సూచించాడు  చాణక్యుడు. తన కుటుంబానికే విశ్వాసం లేని అమ్మాయిలు భర్త పట్ల కూడా విశ్వాసఘాతుకంగానే ప్రవర్తిస్తారట.

5.ఇంటి ని చక్కదిద్దుకోలేని అమ్మాయిలు:
ఇంటిని చూస్తే చాలు ఇల్లాలిని చూడక్కలేదు అన్నారు  పెద్దలు. ఇంటిని శుభ్రంగా, అందంగా ఉంచుకోవడంలో మగాళ్లతో పోల్చితే ఆడవాళ్లదే ప్రధాన పాత్ర. ఇల్లు శుభ్రంగా లేకపోతే ఆ ఇంట్లో ప్రశాంతత ఉండదు.

6.గొడవలు పడే అమ్మాయిలు:
చిన్న చిన్న విషయాలకే గొడవలు పడే  అమ్మాయిలతో పెళ్లే వద్దంటున్నాడు చాణక్యుడు. ఇటువంటి వారు ఏవిధంగానైనా తమకు కావల్సింది సాధించుకుంటారట. అటువంటి వారిని వివాహమాడితే జీవితాంతం తిప్పలు తప్పవట.

7.దైవ భక్తిలేని అమ్మాయిలు:

నిత్యం పూజించే అమ్మాయిలే భర్తను బాగా చూసుకుంటారట.

అమ్మాయిలకు దైవ భక్తి తప్పనిసరి అని చాణక్యుడు చెబుతున్నాడు

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *