జగనన్న “అమ్మఒడి” తొలి జాబితా విడుదల నేడే..

జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ప్రకటించిన నవరత్నాలు, వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలో నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాయి. ఈ నవరత్నాలలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పధకం అమ్మఒడి. ఈ పధకం ఎప్పుడెప్పుడు అమలవుతుందోనని ఎదురుచూస్తున్న అమ్మలకి శుభవార్త చెపింది ప్రభుత్వం. ఈ పధకానికి సంభందించి తొలి జాబితాను నేడే (ఆదివారం) విడుదల చేయనున్నారు.

ఈ జాబితాను రాష్ట్రలోని అన్ని గ్రామసచివాలయాల్లో తనిఖీ నిమిత్తం ప్రవేశపెట్టనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్ మరియు ఇంటర్మీడియట్ వరకూ చదువుకున్న విద్యార్ధుల తల్లి తండ్రులు ఈ పధకానికి అర్హులుగా ప్రకటించారు. ఈ మేరకు 46,78,361 మంది తల్లులను లబ్ధిదారులుగా గుర్తించారు. ఈ జాబితాను గ్రామ, వార్డు సచివాలయాలలో ప్రదర్సనకి ఉంచారు. ఈ జాబితాలో అభ్యంతరాలు ఉన్నవాళ్ళు, జనవరి 2 లోగా తెలియచేస్తే మార్పులు చేర్పులు చేస్తామని ప్రకటించారు. అనంతరం తుది జాబితాని జనవరి 9 న తుది జాబితా ప్రకటిస్తారు. అదే రోజున వారి వారి ఖాతాలలో డబ్బు జమ అవుతుందని తెలిపారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *