రెండు రాజధానులు అయితే బీజేపీకి ఒకే….!!!

ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏదన్నా ఉందంటే అది రాజధాని విషయమే. ఏపీకి  మూడు రాజధానులు ఉండాలని వైసేపీ ప్రభుత్వం అంటుంటే, లేదు అసలు రాజధాని మార్చితే ఊరుకునేది లేదంటూ ప్రతిపక్ష టీడీపీ, జనసేన మండిపడుతున్నాయి, నిరసనలు తెలుపుతున్నాయి. ఈ క్రమంలోనే రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులని రెచ్చ గొడుతూ అల్లర్లు సృష్టిస్తున్నాయి.

Image result for vishnu kumar raju

ఇదిలాఉంటే రాజధాని విషయంలో కిమ్మనకుండా పరిస్థితులని గమనిస్తున్న బీజేపీ తాజాగా తమ ఏపీ నేతతో కీలక వ్యాఖలు చేయించింది. ఎపీకి మూడు రాజధానులు ఉండటం సరైంది కాదని రెండు రాజధానులు ఉండటం మంచిదేనని ఆ పార్టీ నేత విష్ణు కుమార్ రాజు తెలిపారు. అంతేకాదు హైకోర్ట్  ఉన్న ప్రాంతాన్ని రాజధాని అనడం సబబు కాదని అన్నారు. ప్రభుత్వంపై నిరసనలు తెలుపుతున్న రైతులపై పోలీసులు ప్రవర్తించే తీరు ఎంతో అభ్యంతరకరంగా ఉందని ,ప్రభుత్వం ప్రస్తుత రాజధాని రైతులకి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మొత్తానికి బీజేపీ కూడా జగన్ నిర్ణయానికి జై కొట్టినట్టే అంటున్నారు పరిశీలకులు.

 

 

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *