వాయిదా పడిన….”డీఎస్సీ”

ఏపీ ప్రభుత్వం డీఎస్సీ పరీక్షలని రెండు వారాలపాటు వాయిదా వేసింది…ఈ మేరకు విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు…అభ్యర్థుల కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని  ఆయన అన్నారు.తమకి తక్కువ సమయం ఉందని అందుకే..తమకు ప్రిపేర్ కావడానికి సమయం ఇవ్వాలని అభ్యర్థుల నుంచి వినతులు వచ్చిన మేరకు,

ముఖ్యమంత్రి చంద్రబాబు తో చర్చించిన తరువాత ఆయన ఈ ప్రకటన విడుదల చేశారు. అయితే మరొక కొత్త షెడ్యూల్ ని ఈరోజే ప్రకటిస్తామని ఆయన అన్నారు…ఇదిలాఉంటే డీఎస్సీలో అన్ని పోస్టులూ కలిపి 7,729 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ కాగా, ఆరు లక్షల మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *