ఏపీ ప్రజలకి గుడ్ న్యూస్ చెప్పిన..“ఏపీఎస్ ఆర్టీసీ”

కరోనా కారణంగా ఏపీలో రవాణా సౌకర్యం పూర్తిగా నిలిపివేయడంతో ఎంతో మంది ప్రయాణీకులు పలు ఇబ్బందులు పడ్డారు. సొంత వాహనాలు ఉన్న వారు ప్రయాణాలు ఏర్పాటు చేసుకోగా, లేని వారు ఎక్కువ ఖర్చు పెట్టి అయినా ప్రయాణాలు చేశారు. ఈ క్రమంలోనే  ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.

APSRTC makes smartphone mandatory for staff to mitigate Covid-19 ...

సుదూర ప్రాంతాలకి ప్రయాణించే వారు అడ్వాన్స్ గా రిజర్వేషన్ చేసుకునే గడువును 30 రోజులకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రహ్మానంద రెడ్డి మీడియాకి తెలిపారు. కరోనా కారణంగా ఇప్పటి వరకూ కేవలం 7 రోజుల వ్యవధి మారమే రిజిస్ట్రేషన్ కు ఉండేదని తాజాగా దీనిని 30 రోజులకి పెంచుతున్నామని ఆయన తెలిపారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *