అశోక్ బాబు పొలిటికల్ ఎంట్రీ ..? రెండు వందల కోట్లు పెట్టుబడి అందుకేనా ..?

ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు మీద చాలాకాలంగా చంద్రబాబు ప్రేమ ఒలకపోస్తున్నారు. అశోక్ బాబు అసలు రాజకీయాల్లోకి వస్తాడో లేదో తెలియదు కానీ బాబు మాత్రం అదే పనిగా బహిరంగ సభల్లో కూడా రాజకీయాల్లోకి రమ్మని పిలుస్తూ ఒత్తిడి చేస్తున్నాడు. సరిగ్గా ఈ సమయంలోనే అశోక్ బాబు తీసుకున్న ఓ నిర్ణయం వివాదస్పదం అవుతోంది.

అశోక్ బాబు టీడీపీలోకి చేరతాడని ముందు నుంచినే ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు ఆహ్వానాలతో ఆ విషయం మరింతగా ఖరారు అయినట్టే. ఇలాంటి సమయంలో ఉద్యోగుల సొమ్ముపై అశోక్ బాబు నిర్ణయం విమర్శల పాలవుతోంది. తన రాజకీయ జీవితానికి బేస్ మెంట్ ఏర్పాటు చేసుకోవడానికి అశోక్ బాబు ఉద్యోగుల సొమ్మును అది కూడా ఏకంగా రెండు వందల కోట్ల రూపాయల సొమ్మును ఉపయోగించుకున్నాడనే విమర్శలు వస్తున్నాయి.

అశోక్ బాబు టీడీపీలోకి చేరతాడని ముందు నుంచే ప్రచారం సాగుతోంది. చంద్రబాబు ఆహ్వానాలతో ఆ విషయం అందరికి తెలిసిపోయింది. ఇలాంటి సమయంలో ఉద్యోగుల సొమ్ముపై అశోక్ బాబు నిర్ణయం విమర్శల పాలవుతోంది. తన రాజకీయ జీవితానికి బేస్ మెంట్ ఏర్పాటు చేసుకోవడానికి అశోక్ బాబు ఉద్యోగుల సొమ్మును అది కూడా ఏకంగా రెండు వందల కోట్ల రూపాయల సొమ్మును ఉపయోగించుకున్నాడనే విమర్శలు వస్తున్నాయి

ఇటీవలే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులోంచి రెండు వందల కోట్ల రూపాయలను అమరావతి డెవలప్ మెంట్ కు కేటాయిస్తున్నట్టుగా ఏపీ ఎన్జీవో నేత అశోక్ బాబు ప్రకటించాడు. ఆ సొమ్ము రాజధానికి ఏ విధంగా ఉపయోగిస్తాడో తెలియదు కానీ అశోక్ బాబు మాత్రం త్యాగం చేయాలనుకున్నాడు చేసేసాడు. పాపం ఇందులో అశోక్ బాబు పదిహేనురోజుల జీతం కూడా ఉంది.

అయితే ఉద్యోగులు మాత్రం అశోక్ బాబు తీరుపై గుర్రుగా ఉన్నారు. ఆయన ఎలాగు రాజకీయాల్లోకి వెళ్లడం ఖాయం అయిపోయింది. అందుకు మా సొమ్ము 200 కోట్లు పెట్టుబడిగా పెట్టాడు. దీనివల్ల ఆయనకు రాజకీయ ఉద్యోగం దొరుకుతుంది అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఉద్యోగులు మాములుగా ఊరుకుంటారా మా సగం జీతం దొబ్బేసారని కక్ష పెంచుకుని ఎన్నికల్లో దెబ్బేస్తే ఏంటి పరిస్థితి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *