బ్రేకింగ్ : భూమి వైపుగా భారీ గ్రహశకలం -హెచ్చరిస్తున్న నాసా

యుగాంతం అప్పుడా, ఇప్పుడా, ఎప్పుడు అంటూ ఎంతో మంది రకరకాల వాదనలు విన్పిస్తూ ఉంటారు. యుగాంతం జరగాలంటే ఆకాశం నుంచీ పెద్ద గ్రహ శకలం భూమిని గట్టిగా డీ కొడుతుందని, ఈ క్రమంలోనే యుగాంతం సంభవిస్తుందని అనే వాదన కూడా ఉంది. ఈ క్రమంలోనే యుగాంతం వస్తుందా అన్నట్టుగా భూమి దిశగా ఓ భారీ గ్రహ శకలం దూసుకువస్తోందని నాసా పేర్కొంది. దీని పొడవు దాదాపు 39 అడుగులని ఇది సెకనుకు 8.16 కిలోమీటర్ల వేగంతో వస్తోందని తెలిపింది…అయితే

Will 2011 ES4 Hit Earth on Tuesday? .. NASA Answers | Saudi 24 News

ఈ గ్రహ శకలం వలన భూమికి ఎలాంటి ప్రమాదం ప్రస్తుతానికి లేదని, కానీ భవిష్యత్తులో మాత్రం ఇది భూమిని డీ కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నాసా ప్రకటించింది. ఈ గ్రహశకలం పేరు ఈఎస్ -4 దీనికి ఈ పేరును 2011 లోనే పెట్టారు. గతంలో కూడా ఇది భూమికి దగ్గరగా వచ్చిందని కానీ అప్పుడు దూరంగా ఉందని, ఈ సారి మరింత దగ్గరగా వస్తోందని తెలిపింది. ఇలాంటి గ్రహ శకలాల వలన భూమికి ఎప్పటికైనా ప్రమాదమేనని అంటున్నారు శాస్త్రవేత్తలు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *