బ్రేకింగ్: బాలయ్య అభిమానులకు బిగ్ షాకింగ్…అయ్యో ఇలా అయ్యిదేంటి…!!!
నందమూరి బాలకృష్ణ అభిమానులకు ఈ న్యూస్ బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. బాలయ్య బాబు నటిస్తున్న భగవత్ కేసరి సినిమా రిలీజ్ ఇప్పటిలో ఉండదనే టాక్ సినిమా ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తోంది. అక్టోబర్ 19న థియేటర్స్ లో విడుదలై నందమూరి అభిమానులను అలరిస్తుందనుకున్న భగవత్ కేసరి ప్రస్తుతానికి పోస్ట్ ఫోన్ అయిందన్న విషయం అభిమానులకు తీవ్ర నిరాశను కలిగిస్తోంది… వివరాల్లోకి వెళితే

ఏపీ మాజీ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో అరెస్టయిన విషయం అందరికీ తెలిసిందే ఈ సమయంలో బాలకృష్ణ టిడిపి బాధ్యతలను భుజాన వేసుకోవడంతో కొంతకాలం షూటింగ్లకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా భగవత్ కేసరి సినిమా రిలీజ్ డేట్ కూడా అఫీషియల్ గా ప్రకటించిన తర్వాత ఈ పరిణామాలు సంభవించడంతో సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ చేయలేని పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది. దాంతో ఈ మూవీ మేకర్స్ మరో రిలీజ్ డేట్ ను సిద్ధం చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారట త్వరలోనే

కొత్త రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా ప్రకటించబోతున్నారని తెలుస్తోంది దాంతో నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో తమ బాధను వ్యక్తపరుస్తున్నారు. ఎప్పుడెప్పుడా మా బాలయ్య సినిమా అని వేచి చూస్తున్న మాకు సినిమా పోస్ట్ పోన్ అవ్వడం బాధగానే ఉంది కానీ మా బాలయ్య బాబు ఈ సమయంలో చంద్రబాబు గారికి అండగా ఉండటం సరైన నిర్ణయమని భావిస్తున్నాం బాలయ్య బాబు ఏ నిర్ణయం తీసుకున్న దాని వెనుక మేము ఉంటామని సోషల్ మీడియాలో తమ అభిప్రాయాల్ని వెల్లడిస్తున్నారు