నంద‌మూరి జోష్‌: ఎన్టీఆర్ ఇంట్లోకి బాల‌య్య‌

నందమూరి అభిమానులకు పండగలాంటి వార్త ఒకటి ఫిలింనగర్‌లో హల్‌చల్ చేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’ రియాలిటీ షో టాప్ రేటింగ్స్‌తో దూసుకుపోతోంది. ఈ షోను చాలా మంది టాలీవుడ్ హీరో, హీరోయిన్లు త‌మ సినిమాల ప్ర‌మోష‌న్ల‌కు వాడుకుంటున్నారు. ఇప్పుడు ఇదే షో బాబాయ్ బాల‌య్య‌ను, అబ్బాయ్ ఎన్టీఆర్‌ను ఒక్క‌టి చేస్తుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ వార్త లీక్ కావ‌డంతో నంద‌మూరి అభిమానుల ఆనందానికి అవ‌ధులే లేవు.

సంబంధిత చిత్రం

ఈ షోను ఇప్ప‌టికే చాలా మంది త‌మ సినిమాల ప్ర‌మోష‌న్ల‌కు వాడుకున్నారు. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా హీరో రానా హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వగా, ‘అనందో బ్రహ్మ’ ప్రమోషన్‌కు తాప్సీ, ‘అర్జున్ రెడ్డి’ ప్రమోషన్‌కు విజయ్ దేవరకొండ హౌస్‌లోకి వెళ్లారు. ఇక ఇప్పుడు బాల‌య్య త‌న లేటెస్ట్ మూవీ పైసా వ‌సూల్ సినిమా ప్ర‌మోష‌న్ కోసం బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న‌ట్టు స‌మాచారం.

ఈ వార్తే కనుక నిజం అయితే నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. అయితే, బాలయ్య ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి వెళ్తే సినిమా ప్రమోషన్‌ ఏమో కానీ, ఎన్టీఆర్‌కు తనకు మధ్య ఎటువంటి విబేధాలు లేవని స్పష్టం చేసినట్ల‌వుతుంది. ఈ వార్త ఇప్పుడు నంద‌మూరి ఫ్యాన్స్‌లో ఓ రేంజ్‌లో జోష్ నింపుతోంది. పూరీ దర్శకత్వం వహించిన పైసా వ‌సూల్ సెప్టెంబ‌ర్ 1న రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *