బాల‌య్య 102కు ప‌వ‌ర్ ఫుల్ టైటిల్‌

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో పైసా వ‌సూల్ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత బాల‌య్య కోలీవుడ్ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ కేఎస్‌.ర‌వికుమార్ డైరెక్ష‌న్‌లో ఓ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో బాల‌య్య రాయ‌ల‌సీమ‌లోని ప‌వ‌ర్ ఫుల్ పొలిటిక‌ల్ లీడ‌ర్‌గా నటిస్తున్నాడ‌ట‌.

ఈ సినిమాకు ముందుగా రెడ్డిగారు అనే టైటిల్ పెడ‌తారంటూ ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఇప్పుడు మ‌రో ఇంట్ర‌స్టింగ్ టైటిల్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. బాలయ్య 102వ సినిమాకు జయసింహ అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నారట. గ‌తంలో ఇదే టైటిల్‌తో ఎన్టీఆర్ ఓ సినిమా చేశారు. ఇక సింహా అనే టైటిల్ బాల‌య్య‌కు ఎలా క‌లిసొచ్చిందో తెలిసిందే.

ఇక ప్ర‌స్తుతం ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్న ఈ సినిమాలో న‌య‌న‌తార‌ను హీరోయిన్‌గా ఫిక్స్ చేశారు. ఇక విల‌న్‌గా సీనియ‌ర్ హీరో శ్రీకాంత్‌ను తీసుకోవాల‌నుకుంటున్నార‌ట‌. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డి కానున్నాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *