మన పూర్వికులు వాడే ఇంటి చిట్కాతో నడుంనొప్పి మాయం…

ప్రస్తుతం ఉన్న ఈ యాంత్రిక పరిస్థితులలో పురుషులు, మ‌హిళ‌లు అన్న భేదం లేకుండా ప్రతీ మనిషి ఎదుర్కుంటున్న సమస్య నడుము నొప్పి. పడుకునే టప్పుడు  కాళ్ళు చేతులు లాగడం,విపరీతమైన నడుం నొప్పితో రాత్రుళ్ళు నిద్రపోని వాళ్ళు చాలామంది ఉన్నారు.
నడుంనొప్పి తో భాదపదేవారిలో ఎక్కువ శాతం మ‌హిళ‌లు అధికంగా ఉంటారు. వేలకువేలు ఆసుపత్రులలో డబ్బులు కట్టినా నయంకాని ఈ నడుంనొప్పిని ఇంటి వ‌స్తువుల‌తోనే న‌యం చేసే ఓ అద్భుత చిట్కాను ఎన్నో వేల సంవ‌త్స‌రాల క్రిత‌మే మ‌న పూర్వికులు, మ‌హ‌ర్షులు క‌నుగొన్నారు.
గవ్వపలుకు సాంబ్రాణి తీసుకుని దానిని పొడిచేసి జల్లెడలో ఆ పొడిని జల్లించాలి. అప్పుడు వచ్చిన మెత్తటి పొడిని పక్కకు పెట్టుకోవాలి. ఎండు ఖర్జూరం తీసుకుని దానిని రెండు భాగాలుగా చేసి దానిలోని గింజని తీసేసి జల్లించగా వచ్చిన మెత్తటి  పొడిని ఆ ఖర్జూరంలో గింజని తిసివేయగా వచ్చిన గుంటలాంటి ప్రదేశంలో ఉంచి ఆ ఖర్జూరం కాయ పడిపోకుండా చుట్టూ దారంతో కట్టుకోవాలి.
ఇప్పుడు మైదా పిండిని తీసుకుని కొంచం నీళ్ళు పోసి ముద్దగా  చేసుకుని  దారంతో కట్టి ఉంచుకున్న ఎండు ఖర్జూరం ని కనపడకుండా మెత్తటి మైదా ముద్దతో చుట్టి నిప్పులమీద  దోరగా అయ్యేంతవరకు వేగనిచ్చి తీసేయ్యాలి. తరువాత పైన ఉన్న మైదాని తీసేసి  ఖర్జూరంని బాగా నూరుకోవాలి అప్పుడు అది మెత్తటి మిశ్రమంగా తయారైనవెంటనే చిన్న చిన్న గోళీలుగా చేసుకోవాలి
ఈ గోళీలని ప్రతిరోజూ ఉదయం సాయంత్రం ఒక్కొక్కటి చప్పున తీసుకోవాలి నొప్పి మరీ ఎక్కువగా ఉన్న వారు మూడుపూటలు వేసుకోవచ్చు ఇలా చేయడం వలన వెన్నునొప్పి తగ్గుతుంది అదేవిధంగా మోకాళ్ళలో ,వెన్ను పూసలలో ఉండే జిగురు పదార్ధం తగ్గిపోతున్న వారికి మరలా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *