ఆ ముగ్గురికి బిగ్ బాస్ షాక్‌…

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తోన్న బిగ్ బాస్ షో ట్విస్టుల మీద ట్విస్టుల‌తో ఆస‌క్తిగా ముందుకు సాగుతోంది. తాజాగా బిగ్ బాస్ చాలా మంది కంటెస్టెంట్ల‌కు షాకులు ఇచ్చాడు. గురువారం ఎపిసోడ్‌లో బిగ్ బాస్ మొత్తం ముగ్గురికి షాక్ ఇచ్చాడు. ముందుగా బర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్ బాబుకు ‘బిగ్‌బాస్’ షాకిచ్చాడు. బిగ్‌బాస్ ఇంటి కెప్టెన్ బాధ్యతల నుంచి ఆయనను తప్పిస్తున్నట్టు ప్రకటించాడు.
అప్పగించిన విధులను సక్రమంగా నిర్వర్తించకపోవడం, పగలు, రాత్రి తేడా లేకుండా నిద్రపోతుండడంతో ఆయనను కెప్టెన్ పదవి నుంచి తప్పిస్తున్నట్టు బిగ్‌బాస్ పేర్కొన్నాడు. సంపూ తీరు తీవ్ర అసంతృప్తి కలిగించిందన్న బిగ్‌బాస్, ఇక ఈ షోకు సంపూ కెప్టెన్ కాడ‌ని కూడా చెప్పాడు. ఇక అప్పగించిన టాస్క్‌ను పూర్తిచేయడంలో విఫలమైన సమీర్ వచ్చేవారం షో ఎలిమినేట్‌కు నేరుగా ఎంపిక‌య్యాడు.
వీరిద్ద‌రికి అదిరిపోయే షాక్ ఇచ్చిన బిగ్ బాస్ మ‌మైత్‌ఖాన్‌కు కూడా అదిరిపోయే షాక్ ఇచ్చాడు. ఆమె బిగ్ బాస్ షోలో ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తోంద‌ని…ఆమెకు తెలుగు ట్యూట‌ర్‌గా జ్యోతిని అపాయింట్ చేశాడు. మ‌రి ఇప్ప‌టికే అదిరిపోయే ట్విస్టుల‌తో కొన‌సాగుతోన్న బిగ్ బాస్ షోలో ఇంకెన్ని ట్విస్టులు చోటు చేసుకుంటాయో ?  చూడాలి.
Also Read:
http://www.telugustarnews.com/telugu/national-media-try-to-buy-tv9/
కేంద్రంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అండ్ కోకి మ‌ద్ద‌తు ప‌లుకుతున్న రిప‌బ్లిక్ టీవీ యాజ‌మాన్య‌మే
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *