తార‌క్‌కు దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చిన స‌మీర్‌ (వీడియో)

ఎన్టీఆర్ హోస్ట్ చేస్తోన్న బుల్లితెర పాపుల‌ర్ షో బిగ్ బాస్ టాప్ టీఆర్పీ రేటింగులతో తెలుగు బుల్లితెర మీద దూసుకుపోతోంది. గ‌త మూడు వారాలుగా ప్ర‌సార‌మ‌వుతోన్న ఈ షోలో ఇప్ప‌టికే ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. జ్యోతి, మ‌ధుప్రియ‌, స‌మీర్ గ‌త మూడు వారాలుగా ఒక్కొక్క‌రు ఎలిమినేట్ అవుతూ వ‌స్తున్నారు.

ఇక బ‌ర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్‌బాబు త‌ప్పుకోగా ఆ ప్లేస్‌లో దీక్ష ఎంట్రీ ఇచ్చింది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన స‌మీర్ ఈ షోలో త‌న అనుభ‌వాల‌ను మీడియాతో పంచుకున్నారు. ఇక ఈ షోకు ఎన్టీఆర్‌ను హోస్ట్‌గా పెట్టిన వాళ్లు ఎవ‌రో కాని, వాళ్ల పాదాల‌ను న‌మ‌స్కారం చేయాల‌ని ఎన్టీఆర్ హోస్టింగ్‌ను మెచ్చుకుంటూ ఆకాశానికి ఎత్తేశాడు.

ఇక ఎన్టీఆర్‌ను తాను గ‌తంలో కూడా ద‌గ్గ‌రుండి చూశాన‌ని, అప్ప‌ట‌కీ, ఇప్ప‌ట‌కీ తార‌క్‌లో విప‌రీత‌మైన మెచ్యూరిటీ లెవ‌ల్స్ పెరిగాయ‌న్నారు. హౌస్‌లో ఎవ‌రు ఏం చేస్తున్నారో ఎన్టీఆర్ గ‌మ‌నిస్తోన్న విధానం, రెస్పాండ్ అవుతోన్న తీరు సూప‌ర్బ్ అని కితాబిచ్చాడు. ఇక హౌస్‌లో ఎవ‌రు జెన్యూన్‌గా మాట్లాడుతున్నారో, ఎవ‌రు ఫేక్‌గా మాట్లాడుతున్నారో చిటికెలో ప‌ట్టేస్తున్నార‌ని చెప్పాడు.

https://www.youtube.com/watch?v=1aWysXPAIMA

ఏ విష‌యంపై అయినా తార‌క్ క్ష‌ణాల్లో స్పందిస్తోన్న తీరు అద్భుతం అన్న స‌మీర్‌…తెలుగులో 16.7 టీఆర్పీ రేటింగ్ ఎప్పుడూ చూడలేద‌ని, అది కేవ‌లం తార‌క్ వ‌ల్లే సాధ్య‌మైంద‌ని ఓ రేంజ్‌లో ప్ర‌శంసించారు. స‌మీర్ త‌న‌ను ప్ర‌శంసించిన తీరు చూస్తే ఎన్టీఆర్‌కే మైండ్ బ్లాక్ అయిపోవ‌డం ఖాయం.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *