బీజేపీ బలపడటానికి..జనసేన బలై పోతోందా..పవన్ ఏంటిది..??

ఎన్నో ఆశలు, ఎన్నో ఆశయాలు, మరెన్నో సవాళ్లు ఎదుర్కుంటూ ఎప్పటికప్పుడు  నూతన ఉశ్చాహం తెచ్చుకుంటూ ముందుకు వెళ్తోంది జనసేన పార్టీ. గడిచిన ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో విజయం నమోదు కాకపోయినా చివరికి తానె ఓడిపోయినా ఎక్కడా అధైర్య పడలేదు, పార్టీలో నాయకులకు ధైర్యం చెప్తూ, అభిమానులలో రెట్టింపు ఉశ్చాహం నింపుతూ క్యాడర్ ను కాపాడుకుంటూ వస్తున్నారు. అలాగే పార్టీ కార్యకలాపాల కోసం ఆర్ధిక పుష్టి కోసం పవన్ సినిమాల బాట పట్టక తప్పలేదు. ఒక వైపు సినిమాలు , మరొక వైపు పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటూ నిత్యం శ్రమిస్తూనే ఉన్నారు. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా

Read: Will BJP-JanaSena alliance affect the prospectus of YSRCP congress in  Local Body elections

బీజేపీ తో పొత్తు వ్యవహారంలో పవన్ ఆచి తూచి వ్యవహరించాల్సి ఉండాలని, బీజేపీతో పొత్తు పెట్టుకోవడం పవన్ చేసిన అతి పెద్ద బ్లండర్ మిస్టేక్ అని అంటున్నారు పరిశీలకులు. కేవలం మేధావులు మాత్రమే కాదు, పవన్ ఫ్యాన్స్ సైతం ఇదే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ పార్టీ కావాలనే పవన్ కళ్యాణ్ ను తొక్కడానికి ప్రయత్నాలు చేస్తోందని, పవన్ బయటకి వెళ్ళకుండా ముందుగానే పొత్తు పెట్టుకుని ఇప్పుడు అవమానాలపాలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.

Pawan Kalyan - Wikipedia

పవన్ కళ్యాణ్ మంచి తనాన్ని బీజేపీ  అలుసుగా తీసుకుంటోందని, జనసేనాని తీసుకునే ప్రతీ నిర్ణయంలో బీజేపీ ని సంప్రదించి జరపడం తమకు ఏ మాత్రం రుచించడం లేదని అంటున్నారు. తెలంగాణా గ్రేటర్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేయాలనీ అనుకున్నా బీజీపీ కావాలనే పవన్ చె పోటీ విరమించుకునేలా చేశారని అంటున్నారు. అలాగే తిరుపతి లో పోటీ చేయాలని అనుకుంటే అక్కడ కూడా బీజేపీ అడ్డుపడిందని, జనసేనాని అభిమానులు వాపోతున్నారు. పవన్ త్యాగం చేస్తుంటే ఆయన బలాన్ని బీజేపీ వాడుకుంటూ బలపడుతోందని, పవన్ చేస్తున్న త్యాగాలను బీజేపీ ఎప్పుడో గాలికి వదిలేసిందని అంటున్నారు పవన్ ఇప్పటికైనా కోలుకోవాలని  తన నీడలో చాపకింద నీరులా పాతుకు  పోతున్న బీజేపీ కి బుద్దిచెప్పాల్సిందేననే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *