దున్నపోతు ఖరీదు 14 కోట్లు…మ్యాటర్ తెలిస్తే షాకే..!!

గేదెలు, ఆవులు, దున్నపోతులు వీటన్నిటి గురించి పల్లెటూరిలో పుట్టి, పెరిగిన వారికి బాగా తెలుస్తుంది. పల్లెటూరు అంటేనే పాడి, పచ్చదనం, వ్యవసాయం ఇవి గుర్తొస్తాయి. నగరాలలో నివశించే వారికి వీటి గురించి తెలిసినా, అవగాహన తక్కువ ఉంటుంది. సాధారణంగా ఒక దున్నపోతు విలువ ఎంత అంటే ఎవరైనా సరే వేలల్లోనో, ఇంకా మేలైన జాతి అనుకుంటే లక్షల్లోనో చెప్తారు.. కాని ఓ దున్నపోతు విలువ ఎంతో తెలుసుకొని అంతా అవాక్కవుతున్నారు…అసలు విషయం ఏంటంటే..

 

 

ఇటీవల రాజస్థాన్ లోని నాగోరీ లో జరిగిన పశు మేళలో ప్రధాన ఆకర్షణగా నిలిచిన ఓ దున్నపోతు విలువ అక్షరాల రూ.14 కోట్లు. ముర్రా జాతికి చెందిన ఈ దున్నపోతు సంరక్షణను అరవింద్ అనే వ్యక్తి చూసుకుంటున్నారు. దీనికి ముద్దుగా భీమ్ అని కూడా పేరు పెట్టుకున్నారు. అయితే ఈ భీమ్ బరువు 1300 కేజీలు. పశు ప్రదర్శనల్లో కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది భీమ్. ప్రస్తుతం దీని ధర 14 కోట్లు పలుకుతున్నా, దీనిని వదులుకోవటానికి అరవింద్ మాత్రం ఇష్టపడటం లేదు… ఇదిలా ఉంటే..

 

భీమ్ పోషణ అంత తేలికైన పని కాదు.. దీని పోషణకై అరవింద్ సుమారు, రోజుకి 3 నుంచి 4 వేలు ఖర్చుపెడుతున్నారట. పశు వైద్యులు సూచించిన డైట్ ని క్రమం తప్పకుండ భీమ్ కు అందిస్తున్నారు. సోయాబీన్, శనగలు ఈ రెండు దీని డైట్ లో రెగ్యులర్ గా ఉంటాయట. అంతేనా.. భీమ్ కు ఉదయాన్నే వ్యాయామం చేయించి, మొత్తం శరీరానికి ఆయిల్స్ తో మర్దన కూడా చేయిస్తారు. ఇంత జాగ్రత్తగా పెంచుతున్నారు కాబట్టే భీమ్, పశు పోటీలలో కండలు తిరిగిన దేహం తో ప్రధాన ఆకర్షణగా నిలిచి అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది.

 

 

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *