ఇక ఆక్సీమీటర్ అవసరం లేనట్టే…సరికొత్త యాప్ అందుబాటులోకి..

కరోనా సమయంలో ప్రతీ ఒక్కరి ఇంట్లో   పల్స్ ఆక్సీమీటర్ ఉండాల్సిందేనని కరోనా వచ్చిన వారు తప్పకుండా ఈ ఆక్సీ మీటర్ ద్వారా వారి ఆక్సిజన్ లెవిల్స్ తెలుసుకుని జాగ్రత్త పడాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే డిమాండ్ ను బట్టి ధరలలో కూడా మార్పు వస్తుంది అందుకే ఆక్సీ మీటర్స్ ధరలు కుడా అమాంతం పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే మీ శరీరంలో ఆక్సిజన్ లెవిల్స్ తెలుసుకోవడానికి ఆక్సీమీటర్ అవసరమే లేదు మా యాప్ మీ ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకోండి చాలు అంటూ కోల్కతా  కు చెందిన కేర్ నౌ హెల్త్ కేర్ హెల్త్ టెక్ కంపెనీ ఓ యాప్ ను రూపొందించింది.

CarePlix Vital’  అనే పేరుతో  విడుదలైన ఈ యాప్ తో మన ఆక్సిజన్ లెవల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో వెంటనే చెప్తుందని సంస్థ తెలిపింది. ఇందులో మరొక గొప్ప విషయం ఏమిటంటే ఈ యాప్ స్మార్ట్ ఫోన్ వెనుకాల ఉండే కెమెరా ఫ్లాష్ ద్వారా పనిచేస్తుంది. ఈ యాప్ ఓపెన్ చేసి కెమెరా వెనుక ఉన్న ఫ్లాష్ ను గట్టిగా అదిమి పడితే వెంటనే ఆక్సిజన్ లెవల్స్  చెప్పేస్తుందట. అధునాతనమైన ఆర్టిఫిషియల్ ఇంటిలిజన్స్ ద్వారా ఈ యాప్ పనిచేస్తుందని ఇందులో వచ్చే ఆక్సిజన్ లెవల్స్ 98 శాతం ఖచ్చితత్వాన్ని ఇస్తోందని తెలుస్తోంది.

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *