బాబుకి కేంద్రం పెద్ద షాక్…

ఉపాధి హామీ  ద్వారా ప్రతి ఆర్థిక సంవత్సరములో నైపుణ్యము లేని ప్రజలకి ,ప్రతి గ్రామీణ కుటుంబంలో పనిని కోరిన వారికి ఆ గ్రామీణ పరిధిలో 100 రోజుల పని కలిపించేలా కనీస వేతనం  వచ్చేలాగా చట్ట పరమైన హామీని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ప్రజలకి ఈ పధకం లబ్ది చేకూర్చేలా పర్యవేక్షిస్తుంది. గ్రామీణ ప్రాంత మహిళలకి పొలం పనులు చేసుకునే వారికి,ఇలా ఎంతో మందికి ఈ ఉపాధి హామీ పధకం ఉపయోగపడింది అయితే కేంద్రం ఉపాధి హామీ నిధులని ఏపీకి నిలిపివేసింది

దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ఉపాధి హామీ నిధులను విడుదల చేసిన కేంద్రం ఏపీకి మాత్రం ఆ నిధులను ఇవ్వలేదు. ఏపీ ప్రభుత్వం చేస్తున్న తప్పులకే నిదర్శనమే ఈ పరిణామం. మన ఏపీ ప్రభుత్వ తప్పిదానికి ఈ పధకం ద్వారా రోజు పోట్టపోసుకుంటున్న లక్షల మంది  లబ్ది దారులు పరిస్థితి రోడ్డున పడనుంది

ఉపాధి హామీ పనులకు గానూ విడుదల చేసిన నిధుల విషయంలో ఏపీ ప్రభుత్వం లెక్కలను కేంద్రానికి సమర్పించలేదని సమాచారం. అందువలనే కేంద్రం ఈ ఏడాది  ఉపాధి హామీ నిధులనే ఆపేసిందట. చంద్రబాబు ప్రభుత్వం ఉపాధి హామీ నిధుల గురించి ఎందుకు కేంద్రానికి నివేదికలు ఇవ్వలేదు?

  అడ్మినిస్ట్రేషన్ లో స్ట్రిక్ట్ గా ఉంటాను తప్పు ఎవరు చేసినా తాట తీస్తా అనే చంద్రబాబు,ఉపాధి హామీ పధకం అమలు లో చాలా అశ్రద్ధ చూపారని,ఈ పధకానికి వచ్చిన నిధులని పండగలు, పబ్బాలు నిర్వహించడానికి,చంద్రన్న కానుకలకు ఆ నిధులను ఖర్చు చేసేసింది అని టాక్.అందుకే గత ఏడాది నిధుల లెక్కలు ఇవ్వనందుకు కేంద్ర ఈ ఏడాది నిధులని ఆపేసింది.ఈ పధకం మీదనే ఆధారపడి ఉన్న లబ్దిదారుల పరిస్థితికి బాబు ఏ దారి చూపుతారో చూడాలి

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *