సర్వేల పేరుతో ఎమ్మెల్యేలకి “చెక్ ” పెట్టనున్న చంద్రబాబు

టీడీపిలో ఎవరిని అయినా తొలగించాలి అన్నా తనకి అడ్డు వచ్చిన వాళ్ళ నోళ్ళు మూయించాలి అన్నా చంద్రబాబు ఎప్పుడూ ఒక స్కెచ్ వేయడం అలవాటు.ఇప్పుడు అదే జరుగుతోంది.టీడీపి అధినాయకుడు చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు వింటుంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిద్రలోకూడా ఉలిక్కిపడి లేస్తున్నారట.ఎప్పుడు ఎం జరుగుతుందా అని అనుక్షణం భయపడుతున్నారట.ఇదంతా చుసిన ఎమ్మెల్యేల అనుచరగణం పాపం ఎమ్మెల్యే అని ఫీల్ అవుతున్నారట . ఇంతకీ విషయంలోకి వెళ్తే…

chandrababu కోసం చిత్ర ఫలితం

  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎమ్మెల్యేల పని తీరుమీద ఈ ఏడాదిలో నాలుగు సర్వేలు చేయిస్తాడట..ఈ సర్వేలలో ఫలితాలు ఎవరికీ అనుకూలంగా వస్తే వారికే ఈ సరి టిక్కెట్ ఇస్తాను అని చెప్పడం తో వారికి గుండెల్లో గుబులు మొదలైంది. ప్రజలలో ఎవరికైతే ఆదరణ ఉంటుందో వారికే 2019 ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇస్తామని చెప్పారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల బంధువుల జోక్యం ఎక్కువయిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని అధినేత అసహనం వ్యక్తం చేశారు. బంధువులే అనేక నియోజకవర్గాల్లో కాంట్రాక్టర్లుగా అవతారమెత్తి దోచుకుంటున్నారన్న అపప్రధను ఎక్కువమంది ఎమ్మెల్యేలు మూటగట్టుకుంటున్నారు. ఏడాది సమయంలో నాలుగుసార్లు సర్వే చేయించాలని నిర్ణయించారు. నాలుగు సర్వేల్లో ఫలితాలను బట్టే టిక్కెట్ కేటాయింపు ఉంటుందని చంద్రబాబు తేల్చి చెప్పేశారు.

         ఇప్పటి వరకూ నియోజక వర్గాల అభివృద్ధి,నిధుల గురించి ఎక్కడా ప్రస్తావించని ఎమ్మెల్యేలకి ఇప్పుడు సడన్ గా నిధులు గుర్తుకు వచ్చాయి.పైగా నిధులకోసం కాళ్లరిగేలా సచివాలయం చుట్టూ తిరుగుతున్నా ఆర్థిక పరిస్థితి బాగాలేదన్న సమాధానమే వస్తుందని ఎమ్మెల్యేలు చెబుతున్నారు.  ఒకడుగు ముందుకు వేసిన పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యే ఒకరు ఏకంగా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ముందు పంచాయతీ పెట్టి మరి తమ గోడుని వెళ్లగక్కారట…తాను మూడేళ్ల నుంచి నిధులు అడుగుతున్నా ప్రభుత్వం విడుదల చేయకుంటే నా తప్పు ఎలా అవుతుంది నేను ఏమి చేయను ఇప్పుడు సర్వేలో నా పేరు వస్తే ఎలా అని తెగ మధన పడిపోతున్నారట  ఇలా ప్రతి ఎమ్మెల్యేలోనూ నిధుల విడుదల చేయలేదన్న అసంతృప్తి ఉంది. ఈ పరిస్థితుల్లో నాలుగు సర్వేల్లో తమకు ప్రతికూలంగా వస్తే టిక్కెట్ ఇవ్వనని చెప్పడాన్ని కొందరు అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కంటే వ్యక్తిగత ఇమేజ్ వల్లనే గెలుస్తున్నామని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక ప్రజాప్రతినిధి వ్యాఖ్యానించడం విశేషం. మొత్తం మీద చంద్రబాబు ప్రకటనతో తెలుగుదేశం పార్టీ నేతలు ఏమి చేయాలో పాలు పోక . తమ పార్టీ మీదనే విమర్శలు చేయడం అందరిని విస్మయానికి గురిచేస్తోంది.ఈ మొత్తం ఎపిసోడ్ వైఎస్సార్ పార్టీకి అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు ఆ నేతలు

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *