డ్రగ్స్ విచారణపై చార్మీ మెలిక… హైకోర్టులో పిటిషన్
డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న నటి చార్మి హైకోర్టును ఆశ్రయించింది. డ్రగ్స్ కేసులో పోలీసులు మొత్తం 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విచారణకు హాజరవుతోన్న వారికి సిట్ అధికారులు బ్లడ్ టెస్టులు కూడా చేస్తున్నారు. ఈ బ్లడ్ శాంపిల్స్ సేకరణ సరికాదని హైకోర్టులో రిట్ వేసింది. విచారణ తీరు సరిగా లేదని చార్మి ఆరోపించింది.
చార్మి ఫిటిషన్ ఈ రోజు మధ్యాహ్నం విచారణకు రానుంది. చార్మిని ఈ నెల 26న సిట్ విచారించనున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే చార్మిని ఆమె తండ్రి దీప్‌సింగ్ పూర్తిగా వెనకేసుకు వస్తున్నారు. ఆమెకు డ్రగ్స్ మీద దృష్టిపెట్టేంత తీరిక, సమయం లేదని ఆమె తండ్రి దీప్‌సింగ్ అన్నారు. అనవసరంగా ఆమెను ఈ కేసులోకి లాగారని మండిపడ్డారు.
మరో షాక్ ఏంటంటే దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు కూడా ఈ కేసుతో ఎలాంటి సంబంధం ఉండదని, ఆయన ముత్యం లాంటి వాడని దీప్‌సింగ్ చెపుతున్నారు. మరి చార్మి పిటిషన్‌పై హైకోర్టు ఏం చెపుతుందో ? సిట్ విచారణకు ఏమైనా బ్రేకులు వస్తాయా ? అన్నది ఇప్పుడు కాస్త సస్పెన్స్‌గా ఉంది.