“దుమ్మురేపుతున్న” సైరా…“టీజర్”

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం 150 అఖండ విజయం తరువాత చిరు చేపట్టబోయే ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో అని చాలా కాలం వేచి చూసిన మెగా అభిమానులకి ఒక స్వాతంత్ర సమరయోధుడిగా చిరు కనిపిస్తాడు అని తెలియగానే ఎలా ఉంటాడో సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అంటూ వేయి కళ్ళతో వేచి చూశారు అందరూ అయితే ఎప్పుడెప్పుడా  సినిమా టీజర్ అని వేచి చూసిన వారందరికి కనువిందు చేసే విధంగా ఒక సెప్టెంబర్ 21 అనగా ఈరోజు టీజర్ రిలీజ్ చేశారు…అయితే

Image result for saira narasimha reddy

మెగాస్టార్ స్థాయికి ఏ మాత్రం మించకుండా సురేంద్ర రెడ్డి అశేష ప్రేక్షకులకి అందించిన ఈ టీజర్ ఇప్పటికే దుమ్ము రేపుతోంది..చిరుని సైరా గెటప్ లో చూసిన వారికి రోమాలు నిక్కపోడుచుకోవడం మాత్రం ఖాయం అందులో సందేహం లేదు..బ్రిటీష్ వారిని ఎదిరిస్తూ ఉన్న సీన్లు చూస్తుంటే ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు అంటున్నారు..ఇక సినిమాలో ఉన్న గ్రాఫిక్స్ సైతం చాలా సహజంగా రావడంతో సినిమా మీద అంచనాలని పెంచుతోంది..

సైరా టీజర్ చూసిన సగటు ప్రేక్షకుడు సైతం ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందో అనే ఆశతో వేచి చూడటం ఖాయం అంటున్నారు సినిమా విశ్లేషకులు..మరి సైరా టీజర్ మీరు కూడా ఓ లుక్ వేయండి..

 

 

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *