అత్యంత ఖరీదైన రోడ్డు ప్రమాదం..నష్టం ఎంతో తెలుసా..!!
ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగితే ఎంతమని చనిపోయారు, క్షతగాత్రులు ఎవరు, పరిస్థితి ఎలా ఉందని అడుగుతారు. కానీ ఇక్కడ జరిగిన ప్రమాదం కారణంగా ఎంత పెద్ద నష్టం జరిగిందో అనుకుంటున్నారు. అంతేకాదు రికార్డ్ కూడా క్రియేట్ చేసింది. అత్యంత ఖరీదైన ప్రమాదంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ యాక్సిడెంట్ తెగ పాపులర్ అయ్యింది. ఇంతకీ ఏంటి విషయం అనుకుంటున్నారా..సరే ఈ మ్యాటర్ పై ఓ లుక్కేద్దాం..
న్యూజిల్యాండ్ లో ఓ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్ అయ్యిపోయింది. మెర్సిడెస్ బెంజ్ సీ – క్లాసు వ్యాగన్, ఫోర్బ్స్ 911 , బుగట్టి చిరోన్ అనే మూడు కార్లు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లు. ఈ మూడు కార్లు అక్కడి రోడ్లపై ఎంతో వేగంగా ప్రయాణం చేస్తున్నాయి. అయితే ఒక దానిని ఓవర్ టెక్ చేయబోయి మరొక వాహనాన్నిడీ కొట్టడంతో మూడు ఒకే సారి డీ కొట్టడం వలన కార్లు పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. ఈ ఘటన స్థలంలో ఉన్న కొందరు క్షతగాత్రులని ఆసుపత్రికి తరలించారు.అయితే ఈ కార్ల మొత్తం విలువ రూ. 30 కోట్లు పై మాటేనని అంటున్నారు ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.