మధుమేహం అంటువ్యాధిగా మారనుందా…?

ప్రపంచం మొత్తం ఇప్పుడు  ఒకే ఒక జబ్బు పేరు చెప్తే  గజగజా వణికిపోతోంది అదే మధుమేహం ఈ మధుమేహం ఉన్నవాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది ప్రతిదానికి కంగారు పడుతుంటారు, నీళ్ళు ఎక్కువగా తీసుకుంటారు, పడి నిమిషాలకి ఒకసారి బాత్రుం కి వెళ్లి రావలసిన పరిస్థితి అసలు అవి తలుచుకుంటేనే రోగం లేనివాళ్ళకి గాబరా మొదలవుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) లెక్కల ప్రకారం ప్రపంచ జనాభాలో ఆరు శాతం మంది టైప్‌–2 మధుమేహంతో బాధపడుతున్నారు. 1985 సమయంలో కేవలం మూడు కోట్ల మంది మాత్రమే ఉన్న మధుమేహ బాధితులు.. 2015 నాటికి 39 కోట్లకు చేరుకున్నారు. జీవనశైలిలో వచ్చిన మార్పులు.. జంక్‌ఫుడ్‌.. వ్యాయామలేమి.. పని ఒత్తిడి కారణంగా మధుమేహం బారిన పడుతున్నట్లుగా గుర్తిం చిన వైద్యులు ఈ అంశాల్లో మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇక వారసత్వంగానూ మధుమేహం వచ్చే అవకాశం ఉందన్న విషయం తెలిసిందే.

  ఐతే ఇప్పుడు ప్రపంచం అంతా ఉలిక్కిపడేలా టెక్సాస్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త లు మధుమేహం మీద  వారు చేసిన పరిశోధనలను వెల్లడించారు అదేమిటంటే మధుమేహం ఒకరి నుండి మరొకరికి సంక్రమించే అంటువ్యాధి కావచ్చు ,పశువులనుండి మనిషికి గాలికుంటు వ్యాధి తరహాలో మధుమేహం కూడా వచ్చే  అవకాశాలు ఉన్నాయి అని పేర్కొన్నారు  

 

టెక్సాస్ విశ్వవిద్యాలయ ప్రయోగం ? 

మధుమేహం వచ్చిన వారి శరీరంలో కొన్ని ప్రోటీన్ల  మోతాదు ఎక్కువగా ఉండటం గుర్తించారు శాస్త్రవేత్తలు ఇలా ఎక్కువగా ఉండటానికి కారణం ఏమిటి అని పరిశోధనలను చేశారు మధుమేహ బాధితుల్లో ‘అమైలాయిడ్‌ పాలీపెప్టైడ్‌ అనే ప్రొటీన్‌ (ఐఏపీపీ)’కొంచెం భిన్నమైన ఆకారంలో ఉండి, కొన్ని చోట్ల పోగుపడుతున్నట్లు గుర్తించారు. ఇలాంటి ప్రొటీన్లను సేకరించి కొద్ది మోతాదుల్లో ఎలుకలకు ఎక్కించి పరిశీలించగా.. వాటి క్లోమ గ్రంథుల్లో ఈ ప్రొటీన్‌ అధికంగా చేరడం మొదలైంది. కొన్ని వారాల వ్యవధిలోనే ఆ ఎలుకల్లో మధుమేహం లక్షణాలు కనిపించాయి.

క్లోమగ్రంథిలో ఐఏపీపీ మోతాదు ఎక్కువైనప్పుడు అవి ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే బీటా కణాలను నాశనం చేస్తుండవచ్చని.. అందువల్లే మధుమేహం తలెత్తిందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం  యూరోపియన్‌ దేశాల్లో వేలాది పశువులు  మృతి  చెందటానికి గాలికుంటు వ్యాధి కారణం, ఈ గాలికుంట వ్యాధి  ఐఏపీపీల కారణంగానే పశువుల నుంచి మనుషులకు సంక్రమించినట్లు పరిశోధనలు చెబుతున్నాయి. స్పష్టంగా చెప్పాలంటే… మధుమేహ లక్షణాలున్న జంతువుల మాంసాన్ని తిన్నా.. ఏ కారణం చేతనైనా ఐఏపీపీల వంటి ప్రొటీన్లు మన క్లోమగ్రంథిలోకి చేరినా మధుమేహం రావచ్చని అంచనా వేస్తున్నారు.

 

ఆందోళన పడవలసిన అవసరమేమీ లేదు 

మేము చేసిన ఈ పరిశోధనలు ప్రాధమికంగా చేసినవే అని పూర్తీ స్థాయి అధ్యయనం తరువాతా కానీ కచ్చితమైన నిర్ధారణకి రాలేమని టైప్ -2 మధుమేహ వ్యాధి వచ్చే అవకాశం లేదని టెక్సాస్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  మధుమేహం ఎలా తీవ్రమవుతుందో  తమ పరిశోధన ద్వారా తెలుస్తోందని  శాస్త్రవేత్త క్లాడియో సోటో చెప్పారు. మధుమేహానికి దారితీసే మూల కారణాన్ని కూడా తెలుసుకోవడం త్వరితగతిన నివారణం చర్యలని తీసుకునే అవకాశం ఉంటుంది అని తెలిపారు  

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *