ఇదీ “జగన్” కి “చంద్రబాబు”కి మధ్య ఉన్న తేడా…
జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకముందే తనదైన శైలిలో అందరిలో క్రేజ్ సంపాదించుకుంటున్నారు. ప్రజల ఖర్చు ఎక్కడా దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని తాను చేయకూడదని. ప్రజల డబ్బుని వృధాగా ఖర్చు పెట్టకూడదని భావించిన జగన్ అందుకు తగ్గట్టుగా తన ప్రమాణ స్వీకారాన్ని అత్యంత సాదాసీదాగా నిర్వహించాలని సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంను ఆదేశించారట. ఈ కార్యక్రమానికి కి సి ఎస్ ని అడగగా 5 నుంచి 10 లక్షల లోపు అవుతుందని సి ఎస్ చెప్పినట్లుగా తెలుస్తోంది. దాంతో జగన్ ఈ ఖర్చు ఐదు లక్షల లోపే జరగాలని సిఎస్సి ఆదేశించారట.

ఇదిలా ఉంటే గత ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి అయిన ఖర్చు ఐదు కోట్ల పై మాటేన ని, జగన్ అందుకు భిన్నంగా కేవలం ఐదు లక్షల లోపే ప్రమాణ స్వీకారానికి ఖర్చు చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో. జగన్ 5 ఏళ్ల కంటే ముందే సీఎం అయి ఉంటే ఎంత బాగుండేదో అని కామెంట్స్ చేస్తున్నారట. ఇది జగన్ కి 40 ఏళ్ల అనుభవం ఉన్న బాబు కి మధ్య తేడా