డ్ర‌గ్స్ లిస్టులో స్టార్ హీరో కూతురు, స్టార్ క‌మెడియ‌న్‌..

డ్రగ్స్ కేసులో విచారణలో ఈరోజు ఎన్నో షాకింగ్ నిజాలు బయటికొచ్చాయి. ఇక క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ సుబ్బ‌రాజును సిట్ అధికారులు విచారిస్తున్న వేళ ఎన్నో విష‌యాలు వెలుగులోకి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఓ స్టార్ హీరో కూతురు, స్టార్ కమెడియన్ సహా మరో పది మంది వరకు సినీ ప్రముఖుల పేర్లను చెప్పినట్లు విశ్వనీయంగా తెలిసింది. డ్రగ్స్ పంపిణీకి అడ్డాలుగా ఉన్న అనేక పబ్ ల పేర్లు, వాటికి సంబంధించిన ఆధారాలు కూడా రాబట్టినట్లు తెలిసింది.
హీరోయిన్ ఛార్మి సోదరుడి సహాయంతో పంజాబ్ డ్రగ్ మాఫియాకు లింకులు ఏర్పర్చుకుని టాలీవుడ్ ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న విషయాన్నీ సుబ్బరాజుతో చెప్పించినట్లు వెల్లడైంది. సుబ్బరాజు నుంచి కీలక సమాచారం రాబట్టినట్లు స్వయంగా సబర్వాలే చెప్పటంతో ఎవరెవరికి ఈ డ్రగ్స్ వ్యవహారంలో ప‌లు విష‌యాలు వెల్ల‌డైన‌ట్టు తెలుస్తోంది.
ఈ రోజు విచార‌ణ‌లో కొన్ని పేర్లు బయటపడ్డాయని చెప్పారు. ఈ కేసులో సినీ న‌టుల‌నే కాకుండా కొంద‌రు వేరే వ్య‌క్తుల‌ను కూడా విచారించ‌నున్న‌ట్లు తెలిపారు. బిగ్ బాస్ షోలో పార్టిసిపెంట్ గా ఉన్న మొమైత్ ఖాన్‌ను ఈనెల 27న విచారించేందుకు షో నిర్వాహకుల నుంచి అనుమతి తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.
డ్రగ్స్ కేసు ఉచ్చు రోజు రోజుకూ బిగుస్తోంది. టాలీవుడ్ ప్రుముఖుల గుండెలు అదురుతున్నాయి. రాబోయే విచారణల్లోనూ ఎన్నో కీలక ఆధారాలను సేకరించేలా సిట్ అధికారులు రెడీ అవుతున్నారు. ఇక ఈ ఉచ్చులో ఉన్న ఆ స్టార్ హీరో కూతురు, స్టార్ క‌మెడియ‌న్ ఎవ‌రా ? అన్న దానిపై ర‌క‌ర‌కాల పేర్లు ఇండ‌స్ట్రీలో ట్రెండ్ అవుతున్నాయి.
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *