dwraka tirumala temple

చిన్న తిరుపతి  స్వామి వారి దర్శన వేళల్లో మార్పులు..!!!

చిన్న తిరుపతి గా పిలువబడే  ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయంలో స్వామి వారిని దర్శించుకునే వేళలలో మార్పులు చేసినట్టుగా ఆలయ ఈవో జీవీ సుబ్బా రెడ్డి తెలిపారు. రేపటి నుంచీ అనగా 11-6-2021 నుండీ స్వామి వారి దర్సనం ఉదయం 6-30 నిమిషాలకు మొదలై మధ్యాహ్నం 2 గంటల వరకూ దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.

Dwaraka Tirumala the second Tirupati of Andhrapradesh

ఈ విషయంపై మాట్లాడిన ఈవో సుబ్బారెడ్డి ఆలయానికి వచ్చే భక్తులు తప్పకుండా కరోనా నియమ నిభందనలు పాటించాలని సూచించారు. గతంలో ఉదయం 6-30 నిమిషాల నుంచీ మధ్యాహ్నం 12 గంటల వరకూ ఉన్న సమయాన్ని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం మధ్యాహ్నం 2 గంటల వరకూ పొడిగించినట్లు తెలిపారు. భక్తులు తప్పకుండా కరోనా నిభందనలు పాటించి స్వామి వారిని దర్శించుకోవాలని కోరారు సుబ్బారెడ్డి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *