“యూత్” ని ఆకట్టుకుంటున్న ఫేస్‌బుక్‌ “కొత్త ఫీచర్”

ఫేస్‌బుక్‌ ప్రపంచంలో ఈ పదం వాడని వారు ఎవరూ లేరనే చెప్పాలి. చిన్న పిల్లలు సైతం ఎంతో సులువుగా ఈ సోషల్ మీడియా సాధనాన్ని వాడుతున్నారు అంటే ఈ ఫేస్‌బుక్‌ కి ఎంత క్రేజ్ ఉందొ అర్థమవుతుంది. ఉదయం లేచింది మొదలు పడుకునే వరకూ చేతిలో స్మార్ట్ ఫోన్, ఫేస్‌బుక్‌ ఉండాల్సిందే ఎప్పటికప్పుడు ఫేస్‌బుక్‌ వాడుతున్న వారి సంఖ్య పెరుగుతూ ఉండటంతో తాజాగా

Image result for facebook latest feature add music

ఫేస్‌బుక్‌ యూత్ కోసం సరికొత్త ఫీచర్స్ ని లాంచ్ చేస్తూ వినియోగదారులని ఆకట్టుకుంటోంది. తాజాగా  మరో అప్‌డేట్‌తో వస్తోంది. ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసుకునే ఫొటోలు, వీడియోలకు ఇష్టమైన పాటను యాడ్‌ చేసుకునే ఆప్షన్‌ తీసుకొస్తోంది. త్వరలో ఈ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఫేస్‌బుక్‌ ప్రకటించింది. సేమ్‌ ఫీచర్‌ను ఇన్‌ స్టాగ్రామ్‌లో కూడా తీసుకురానున్నట్టు ఫేస్‌బుక్‌ తెలిపింది. ఫొటోకానీ, వీడియోకానీ అప్‌లోడ్‌ చేసి, మ్యూజిక్‌ స్టైకర్‌ చేసుకుంటే నచ్చిన పాటను వాటికి యాడ్‌ చేయొచ్చంటున్నారు. వెయిట్ అండ్ సీ..

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.