మానవ జాతికి తప్పిన పెద్ద ముప్పు..

మనిషి టెక్నాలజీ టెక్నాలజీ అంటూ వేగంగా అడుగులు వేస్తూ సృష్టికి ప్రతి సృష్టి ని నిర్మించే పనిలో ఉన్నాడు కాని ఇక్కడే అత్యంత ప్రమాదకరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి  అని ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్స్ చెప్తున్నా ఎవరు పటించుకోవడం లేదు టెక్నాలజీ అవసరమే కానీ మనిషి మనుగడకి అఘాతం చేకూర్చే అభివృద్ధి మనకు వద్దు అని అనేకమంది ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు.

ఫేస్బుక్, వెబ్సైట్ లలో చాట్బోట్ లు ఉంటాయి ,ఈ  చాట్బోట్ లు సంప్రదింపులు జరపడానికి అంటే మనతో వస్తువులని కొనేలా చేయడం,లావాదేవీలు నడపడం కోసం  సృష్టించబడినవి. మనం అడిగిన ప్రశ్నలకి సమాధానాలని  శాస్త్రవేత్తలు రాసిన కోడింగ్ ప్రకారం మనకు ఇస్తాయి ,మనుషులు మాట్లాడినట్టు సందర్భానికి తగ్గట్టుగా మాట్లాడేలా  టెక్నాలజీని డెవలప్ చేశారు ఇదే ఇప్పుడు విపరీత పరిణామాలకు దారితీసే విధంగా తయారయ్యింది.facebook artificial intelligence chatbot recent issue కోసం చిత్ర ఫలితం

సొంత భాషని తయారుచేసుకున్న చాట్బోట్ లు

సరిగ్గా నెల క్రితం   ఫేస్బుక్ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ రీసెర్చ్ పేరుతో నడుస్తున్న ఒక ప్రాజెక్ట్ లో ప్రపంచం మొత్తం ఉలిక్కిపడేలా అందరం ఆశ్చర్యపోయేలా ఒక వింత జరిగింది. ఫేస్బుక్ లో ఉన్న ఈ చాట్బోట్ వ్యవస్థ ఒకేసారి తమకు తాము మాట్లోడుకోడానికి సొంతగా భాషను సృష్టించు కున్నాయి ఆ పదాలు ఇంగ్లీష్ లోనే ఉన్నాయి కాని వాటి బాష అర్థం కానీ రీతిలో ఉంది,మిగిలిన చట్బోట్ లు మాత్రం అదే బాషలో మాట్లాడుకుంటున్నాయి.మనం ఇచ్చిన కోడింగ్ లో కాకుండా వేరే భాషలో  మాట్లాడుకుంటున్నాయి అని గమనిచిన శాస్త్రవేత్తలు వాటికి అనుసంధానించిన సర్వర్ ని ఆఫ్ చేశారు.

facebook artificial intelligence chatbot recent issue కోసం చిత్ర ఫలితం

అసలు ఈ  చాట్బోట్లు అంటే ?

చాట్బోట్లు అంటే  వెబ్ సైట్  లలో లావాదేవీలు జరపడానికి,యూజర్స్ తో వస్తువుల్ని కొనేలా చేయడం,సేవలని అందేలా చేయడం చేస్తాయి, వెబ్ సైట్ ల ద్వారా ఇతరులతో మాట్లాడిన ప్రతిసారి ఇవి కొన్ని కొత్త విషయాలని తెలుసుకుంటాయి,అంతేకాదు తరువాత  మాట్లాడేవారితో నేర్చుకున్న విషయాలని ఉపయోగిస్తాయి,ఎప్పటికప్పుడు తమని తాము మెరుగుపరుచుకోవడం వాటి ముఖ్యమైన లక్ష్యం

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *