టీడీపీకి న‌లుగురు ఎంపీలు గుడ్ బై..!

టీడీపీలో త్వ‌ర‌లోనే పెను సంక్షోభం రానుందా ?  ఆ పార్టీలో పెద్ద కుదుపు త‌ప్పేలా లేదా ? అంటే అవున‌నే ఆన్స‌ర్లు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. టీడీపీకి మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ ఆ పార్టీని న‌మ్మించి వెన్నుపోటు పొడిచే ప్లాన్లు వేస్తున్న‌ట్టు కూడా తెలుస్తోంది. ఈ విష‌యంలో ఇప్ప‌టికే బీజేపీ టీడీపీని ఎలా దెబ్బేస్తుందో కొన్ని ఫ్రీల‌ర్లు కూడా వ‌దిలేసింది.
వెంక‌య్య‌ను ఉప రాష్ట్ర‌ప‌తిగా పంప‌డం, ఇక్క‌డ ఏపీకి అభివృద్ధి విష‌యంలో సాయం చేయ‌క‌పోవ‌డం, వైసీపీకి ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నాలు చేయ‌డం ఇవ‌న్ని టీడీపీని దెబ్బ‌కొట్టే వ్యూహంలో భాగంగానే జ‌రుగుతున్నాయ‌న్న‌ది ఓపెన్ సీక్రెట్‌. ఇక ఇప్పుడు టీడీపీలో బీజేపీ వేసిన ప్లాన్‌తో పెద్ద కుదుపు త‌ప్ప‌ద‌ని తెలుస్తోంది. టీడీపీలో తీవ్ర అసంతృప్తితో ఉన్న కొంద‌రు ఎంపీలను బీజేపీ త‌మ వైపున‌కు తిప్పుకుని, వారిని వ‌చ్చే ఎన్నిక‌ల్లో  తమ పార్టీ తరపున పోటీ చేయించాలని బీజేపీ భావిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈ జాబితాలో ప్రధానంగా నలుగురు పేర్లు వినిపిస్తున్నాయి.
గల్లా జయదేవ్, రాయపాటి సాంబశివరావు,కేశినేని నాని, అశోక గజపతిరాజు.. వీరు నలుగురూ బీజేపీలో చేరే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం వీరు టీడీపీ ఎంపీలుగా ఉండ‌గా, అశోక్ కేంద్ర మంత్రిగా ఉన్నారు. కేశినేని నాని కొద్ది రోజులుగా బాబుపై ర‌గిలిపోతున్నారు. ఆయ‌న‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్ లేద‌ని విష‌యం ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చేసింది.
ఇక బాబు కోడ‌లు నారా బ్రాహ్మ‌ణి కోసం త‌న‌ను త‌ప్పుకోమ‌ని చెప్ప‌డంతో జ‌య‌దేవ్ కూడా అసంతృప్తితో ఉన్నారు. జ‌య‌దేవ్ త‌ల్లి గ‌ల్లా అరుణ‌కు ఎమ్మెల్సీ ఇస్తాన‌ని మాట ఇచ్చి త‌ప్ప‌డంతో ఆ ఫ్యామిలీ కూడా బీజేపీ వైపు చూస్తోంద‌ని టాక్‌. ఇక విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజుకు బాబు ప్ర‌యారిటీ త‌గ్గించేశారు. ఆయ‌న పూర్తిగా డ‌మ్మీ అయిపోయారు.
ఇక నిత్య అసంతృప్త‌వాది అయిన రాయ‌పాటి సాంబ‌శివ‌రావ‌కు టీటీడీ చైర్మ‌న్ ఇవ్వ‌లేద‌న్న అసంతృప్తి ఉంది. దీనికి తోడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు టిక్కెట్ లేద‌ని డిసైడ్ అయ్యింది. దీంతో ఈ న‌లుగురి ఎంపీలు బీజేపీతో ట‌చ్‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. వీరు టీడీపీని వీడితే అది ఆ పార్టీకి పెద్ద షాక్ లాంటిదే.
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *