“గ్యాంగ్ లీడర్” గా…. నాని…!!!
టాలీవుడ్ న్యాచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నాని వరుస పరాజయాలతో సతమతమవుతున్న సమయంలో, మరోసారి తన కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం జెర్సీ. ఈ సినిమా ఇటీవల విడుదలై నాని కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.జెర్సీ సినిమా హిట్ తో మరోసారి నాని టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యాడు.

దాంతో నాని కొత్త సినిమాపై అందరి కళ్లు పడ్డాయి. అయితే జెర్సీ తర్వాత నాని తన తదుపరి సినిమాను విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. తాజాగా చిత్ర విడుదల తేదీని ప్రకటిస్తూ సోషల్ మీడియాలో చిత్ర యూనిట్ ఓ పోస్ట్ పెట్టింది.
నానీ నటిస్తున్న తాజా చిత్రం గ్యాంగ్ లీడర్ సినిమా ఆగస్ట్ 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నామని ప్రకటించారు. ఈ చిత్రానికి గ్యాంగ్ లీడర్ అనే పేరు ప్రకటించగానే మెగా అభిమానుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం అయ్యింది. అయితే ఈ చిత్రంలో నాని దొంగల గ్యాంగ్ కి లీడర్‌గా నటిస్తున్నాడని, నాని ముఠాలో ఐదుగురు ఆడవాళ్లు ఉంటారని. పూర్తిగా కామెడీ ఎంటర్టైన్మెంట్ గా సినిమా ఉంటుందని తెలుస్తోంది.