దారుణం…భర్త కళ్ళముందే 17 మంది సామూహిక అత్యాచారం

మహిళలపై అత్యాచారాల ఘటనలు రోజుకో చోట జరుగుతూనే ఉన్నాయి. కటినమైన చట్టాలను ప్రభుత్వం తీసుకువస్తున్నా సరే కామందులు బరితెగిస్తూనే ఉన్నారు. ఎంతో మంది మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఝార్ఖండ్ లోని దుమ్కా జిల్లాలో ఓ దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. భర్త కళ్ళముందే ఓ వివాహితను 17 మంది సామూహికంగా అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసిన ఘటన కలకం సృష్టించింది. .

Noida: Three Women Gang-raped by 9 Men in Party at Farmhouse | India.com

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఓ వివాహిత తన భర్తతో పని మీద బయటకి వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వారిని అడ్డుకున్నారు. ఆమెతో అసహ్యంగా మాట్లాడుతున్న క్రమంలో భర్త అడ్డు వెళ్ళగా అతడిని గాయపరిచి భర్త కళ్ళ ముందే అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం తెలియడంతో హుటాహుటిన అక్కడికి వెళ్ళిన పోలీసులు భాదిత మహిళ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను పట్టుకోవడానికి ఓ బృందాని ఏర్పాటు చేశారు. అత్యాచారం ఘటనపై త్వరలో విచారణ జరిపి నిందితులను పట్టుకుంటామని పోలీసులు ప్రకటించారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *