gangrene virus

కరోనా రోగులను భయపెడుతున్న “గ్యాంగ్రిన్”…

మొన్నటి వరకూ కరోనా పేరు చెప్తేనే కంగారు పడేవాళ్ళం..తరువాత సెకండ్ వేవ్ వచ్చేసరికి గుండెల్లో గుబులు మొదలయ్యింది..కానీ నిన్నటి రోజున బ్లాక్ ఫంగస్..వైట్ ఫంగస్ అంటూ కొత్త రకాల రోగాల వస్తున్నాయి అంటూ నిపుణులు హెచ్చరికలు చేస్తుంటే కరోనా వాస్తే చాలు ఎలాగోలా బయటపడుతాం ఈ కొత్త మహమ్మారి ఎంట్రా బాబు అంటూ తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. అయితే వీటన్నిటికంటే అమ్మా మొగుడు మరొక ఫంగస్ ఉందని అంటున్నారు నిపుణులు. బ్లాక్ ఫంగస్ దెబ్బకే బయపడి చస్తుంటే తాజాగా గ్యాంగ్రిన్ అనే మహమ్మారి కోరోనా రోగుల పాలిట శాపం కాబోతోందని అంటున్నారు వైద్య నిపుణులు. గ్యాంగ్రిన్ అంటే ఏమిటి..దీనివలన ఎలాంటి దుష్ప్రభావాలు వస్తాయి అనే విషయాలను వెల్లడించారు..

Gangrene: Causes, Symptoms, Treatment, And Prevention - Medlife Blog:  Health and Wellness Tips

బ్లాక్ ఫంగస్ సోకితే కన్ను దవడ భాగాలపై ప్రభావం చూపి వాటిని తొలగించాల్సి వస్తుంది. కానీ గ్యాంగ్రిన్ సోకితే మాత్రం శరీరంలో అన్ని భాగాలపై దాని ప్రభావం చూపుతుందట. ముఖ్యంగా చేతులు, కాళ్ళు భాగాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ఒక్క సారిగా తిమ్మిరులు వచ్చి వాపు వస్తున్నాయని , తరువాత చల్లబడి పూర్తిగా తొలగించాల్సిన పరిస్థితి ఎదురవుతోందని అంటున్నారు గుజరాత్ లోని ఆహ్హ్మదాబాద్ కు చెందిన ఓ డాక్టర్ ఈ విషయాలని ఓ టీవీ చానల్ కు వివరించారు. కోవిడ్ నుంచీ కోలుకున్న వారిలోనే ఈ వ్యాధి సోకుతోందని. కోవిడ్ నుంచి కోలుకున్న తరువాత వ్యాధి నిరోధక శక్తి తకువగా ఉండటం వలెనే ఈ వ్యాధులు వస్తున్నాయని తెలిపారు.

Gangrene - Cause, Symptoms, Diagoniss & Treatment - By Dr. Radhika A (Md) |  Lybrate

ఈ వ్యాధి సోకినా భాగాలు ముందు మొద్దు బారి తరువాత చల్లబడి , నీలం రంగులోకి మారుతాయని, తరువాత ఎరుపు రంగులోకి మారుతాయని ఈ లక్షణాలు గుర్తించిన ఆరు గంటల్లో చికిత్స తీసుకోకపోతే ఆ భాగాన్ని తీసేయక తప్పదని హెచ్చరిస్తున్నారు వైద్యులు. మార్చి నెలలోనే ఈ తరహా కేసులు నమోదు అయ్యాయని నిపుణులు తెలిపారు. కరోనా నుంచీ కోలుకున్న వారు తప్పకుండా వ్యాధి నిరోధక శక్తి ని పెంచుకునేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *