మరో భారీ నోటిఫికేషన్ …ఏపీలో 63వేల ప్రభుత్వ ఉద్యోగాలు..!!

ఏపీలో నిరుద్యోగులకు గ్రామా,వార్డు సచివాలయాల పేరుట భారీ నోటిఫికేషన్ తో ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించింది ఏపీ ప్రభుత్వం. తరువాత కూడా కొన్ని సచివలయాలలో ఖాళీగా ఉన్న పోష్టులకు మరో నోటిఫికేషన్  విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఏపీ సీఎం వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి నిరోద్యోగులకు ఇంకొక శుభవార్త అందించనున్నారు. వివిధ శాఖలలో ఖాళీల వివరాలకై  చేస్తున  పరిశీలనలో ఇప్పటివరకు 63 వేల ఖాళీలు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారని తెలిపారు. వీటి బర్తీ విషయమై త్వరలో ప్రకటన చేసే అవకాశం ఉండగా…వాటి వివరాలను  సుమారుగా :

 

ఎపీపీఎస్సీ – 19 వేలు

డీఎస్సీ – 21 వేలు

పోలీసుశాఖ – 13 వేలు   ఖాళీలు ఉన్నట్లు అధికారులు  గుర్తించారు. అతి త్వరలోనే వీటి నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని తెలిపారు. ఇదిలా ఉంటే, ఏపీపీఎస్సీ కి సంబంధించిన ఉద్యోగాల క్యాలెండర్ ప్రకటన మార్చిలో జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

 

 

 

 

 

 

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.