జగన్‌ను తిట్టారు…మరి బాలయ్య చేసిందేంటి
నంద్యాల ఉప ఎన్నికకు సమయం ముంచుకొస్తోంది. వైసీపీ – టీడీపీ ఎవరి ప్రచారాన్ని వారు హోరెత్తిస్తున్నారు. ఇక టీడీపీ తరపున ఈ రోజు ప్రచారంలోకి చంద్రబాబు వియ్యంకుడు – హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దిగారు. నిన్నటి వరకు టీడీపీ వాళ్లు జగన్ కాంట్రవర్సీ కామెంట్లు చేస్తున్నారని విమర్శలు చేశారు. ఈ రోజు బాలయ్యకు అదే పంథా ఫాలో అయ్యారు.

తూటాలతో బుద్ధిచెప్పాలంటూ.. వైసీపీపై విరుచుకుపడ్డారు. అంతేకాదు శిల్పా బ్రదర్స్ తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే రకం అంటూ నానా దుర్భాషలకు దిగారు. జగన్ శిల్పా బ్రదర్స్‌ను తిట్టడం వరకు ఓకే కాని మరి భూమా అఖిల కానీ ఆమె తండ్రి
చేసింది ? ఏంటి ? దీనికి బాలయ్య ఏం సమాధానం చెపుతాడని ? వైసీపీ వాళ్లు ప్రశ్నిస్తున్నారు.
2014లో భూమా కుటుంబాన్ని నెత్తిన పెట్టుకుంటే 2016లో జగన్ ను కాదని చంద్రబాబు చూపిన మంత్రి ఆశతో భూమా మరి పార్టీ మారలేదా? అప్పుడు దానిని ఏమంటారు? ఇక కనీసం శిల్పా అయినా నైతికత పేరుతో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీ కండువా కప్పుకొన్నారని ..ఇవన్నీ బాలయ్యకు తెలియదా అన్న చర్చలు నడుస్తున్నాయి.
ఇక ఓటు అనే తూటాతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని అనడం వారివి హంస మాటలు కోతి చేష్టలు అని తీర్మానించడాన్ని వైసీపీ నేతలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. మరి జగన్‌ను విమర్శించిన వాళ్లు ఇప్పుడు బాలయ్య మాటలకు ఏం సమాధానం చెపుతారన్న ప్రశ్నలు వస్తున్నాయి. బాలయ్య హుందాగా మాట్లాడితే బాగుండేది.