హైకోర్ట్ తీర్పుతో షాక్ అయిన ఛార్మి..

ఛార్మి కి హైకోర్ట్ ఇచ్చింది అనే చెప్పాలి ఎందుకంటే  ఛార్మి అంశాలని  కోర్టుకి విజ్ఞప్తి చేసుకుందో వాటిలో చాలా వాటిని  ముందు నుండి SIT అధికారులు నోటిసులు పంపిన వారికి తెలియచేశారు,ఆడవారిని విచారించే సమయంలో మహిళా అధికారిణి కుడా ఉంటారు మరియు SIT కార్యాలయం లో విచారణకి ఇష్టం లేని పక్షంలో వారు కోరిన చోటనే విచారణ చేపడుతా, ఎవరి అనుమతి లేకుండా బ్లడ్ సాంపిల్స్ తీసుకోము  అని చెప్పారు ఇవన్ని మళ్ళి ఛార్మి కోర్టులో ఆర్జీ పెటుకోవడం వలన పెద్దగా కలిసివచ్చిన విషయం ఏమి లేదు అయితే కోర్టు కొన్ని విషయాలలో తీర్పుని ఇచ్చింది

  • మహిళా లాయర్ల సమక్షంలోనే చార్మిని ప్రశ్నించాలని తీర్పిచ్చింది.
  • ఆమెను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారించాలని ఆదేశాలు జారీ చేసింది.
  • చార్మి అనుమతి లేకుండా ఆమె రక్త నమూనాలను సేకరించకూడదని స్పష్టం చేసింది

ఆమె విచారణ ప్రక్రియ మొత్తం తన వ్యక్తిగత న్యాయవాది సమక్షంలోనే విచారించాలని పెట్టుకున్న అర్జీని మాత్రం హైకోర్టు తోసిపుచ్చింది. విచారణాధికారులకు ఏ విధంగా విచారణ జరపాలనే విషయంలో స్వేచ్ఛ ఉంటుందని స్పష్టం చేసింది. ఈ సమయంలో ఛార్మి విచారణ కోసం ఎక్కడ జరగాలని కోరుకుంటుంది అంటే విషయం తేలాల్సి ఉంది. అయితే కోర్టు వరకూ వెళ్లి ఛార్మి సాధించినది ఏమిటి అంటే పుబ్లిసిటీ. ఈ మాత్రం విషయానికి కోర్టు దాకా వెళ్ళాల్సిన అవసరం లేదని తన విజ్ఞప్తిని మా వరకూ తీసుకువచ్చినా మేమే ఆమెకు అనుమతులు ఇచ్చి ఉండేవాళ్ళం అని అధికారులు పేర్కొన్నారు

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *