జయజానకీ నాయక కోసం బోయపాటి ఎంత అడిగాడో తెలుసా…?

తెలుగు సినిమా మాస్ స్థాయిని తనదైన శైలిలో తెరకెక్కించే మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తనకంటూ ఒక విభిన్నమైన స్టైల్ ని ఏర్పరుచుకుని అగ్రహీరోలతో సూపర్ ,డూపర్ హిట్లు ఇచ్చిన బోయపాటి ఇప్పుడు ఇండస్ట్రీ లో ఉనికికోసం పోరాడుతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ని హీరోగా సినిమా చేయడం చాలా సాహసమే చెప్పాలి సరైనోడు తరువాత బోయపటికి భారి ఆఫర్స్ వచ్చాయి బాలకృష్ణ తో  సినిమా చేసే అవకాశం కూడా వదులుకుని ప్రత్యేకంగా చాలా చిన్న హీరోతో సినిమా తీయడం వెనుక పెద్ద హిస్టరీ ఉందట

jaya janaki nayaka కోసం చిత్ర ఫలితం

   ఈ విషయంలో ఇండస్ట్రీ లో టాక్ ఏంటంటే భారీ రెమ్యునరేషన్ కు ఆశపడి ఈ సినిమా భాద్యతని మోస్తున్నాడు అనే వార్తలు కూడా షికారు చేసాయి కానీ బోయపాటి చెప్పిన విషయం వింటే తను మాట ఇస్తే వెనకడుగు వేయని మనిషి అని అర్థం అవుతుంది

   బోయపాటి శీను అందరు అనుకున్నట్టు దీనికి తీసుకున్నది తొమ్మిదో లేక పది కొట్లో కాదట. ఆమాట కొస్తే సరైనోడు కంటే చాలా తక్కువ పారితోషికానికి వర్క్ చేసాడట. కారణం చాలా ఏళ్ళ క్రితం నిర్మాత మిర్యాల రవీంద్ర కు ఇచ్చిన మాట కోసమేనట. అప్పుడున్న తన మార్కెట్ కు తగ్గట్టు అప్పటి రేట్ ప్రకారమే ఇప్పుడు సినిమా చేసిచ్చానని, ఈ సినిమాకు తీసుకుంది కేవలం పాకెట్ మనీ అంత మాత్రమే అని చెప్పి షాక్ కి గురి చేసాడు.

   రేపు ఆగష్టు 11 విడుదలకి సిద్దంగా ఉన్న ఈ సినిమా మీద ఇండస్ట్రీ మొత్తం వేచి చూస్తోంది ఎందుకంటే హిట్లు లేక మంచి హిట్టు కోసం చూస్తున్న హీరో సాయి శ్రీనివాస్ ని ఈ సినిమాలో ఎలా చూపిస్తాడా బోయపాటి అని ఈ సినిమా హిట్ కావడం బోయపాటి కంటే సాయి శ్రీనివాస్ కి చాలా అవసరం

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *