“ఈ ఒక్క SMS ”  తో ఓటరు లిస్టు లో “స్టేటస్”…తెలుసుకోవచ్చు

ఎన్నికల సమయంలో చాలా మంది ఓట్లు ఎగిరి పోతుంటాయి..10 శాతం చిన్న చిన్న కారణాల వలన జరిగితే 90 శాతం అధికార పార్టీ నేతలు భవిష్యత్తులో తమకి అడ్డు వస్తుందని అనుకునే పార్టీల ఓటర్ల ఓట్లని ఎంతో సైలెంట్ గా తీసేయడం వలన పోతుంటాయి..అలాంటి సందర్భంలో ఓటరు గా రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కుని కాపాడుకునే భారతీయుడిగా తప్పకుండా మనం ఓటరు లిస్టు లో మనపేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి..

Image result for indian votes check sms

ఏపీలో దాదాపు 21 లక్షల ఓట్లు తొలగించారని అయితే వాటిలో దాదాపు 18 లక్షల ఓట్లు పైనే జనసేన ఓట్లు ఉన్నాయని కొన్ని రోజుల క్రితమే పవన్ తన అభిమానులకి సూచించారు దాంతో ఖంగారు పడ్డారు మా ఓటు ఉందా లేదా అంటూ పవన్ చెప్పినట్టుగా ఈ సేవా కేంద్రాలని వెళ్లి బారులు తీరారు అయితే మీ ఓటు ఉందా లేదా తెలుసుకోవడానికి ఈ సేవా కేంద్రాల వరకూ వెళ్ళవలసిన అవసరం లేదు కేవలం ఒక్క SMS తో ఓటరు లిస్టు లో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు..అదెలాగంటే.

మీ మొబైల్ లో టెక్స్ట్ మెసేజ్ ద్వారా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి.. ముందుగా  AP అని టైపు చేసి స్పేస్ ఇచ్చి మళ్ళీ VOTE అని టైపు చేసి ఆ తరువాత మీ ఓటరు కార్డుపై ఉండే ఐడీ నెంబర్ ని టైపు చేయాలి. ఆ తరువాత ఆ మెసేజ్ ని 51969 కి పంపితే  మీకు వెంటనే మీ పేరుపై ఓటరు కార్డు ఉందా లేదా అనేది తెలుప బడుతుంది.

EX :-       AP VOTE వోటర్ ఐడీ నెంబర్ అని టైపు చేసి  51969 కి సెండ్ చేయండి

 

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *