చైనా పై యుద్ధం..ఎయిర్ చీఫ్ మార్షల్ సంచలన వ్యాఖ్యలు..!!!

ప్రస్తుతం భారత్, చైనా ల మధ్య యుద్ద వాతావారణం నెలకొంది. చైనాపై ఎప్పటికప్పుడు వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటూ చావు దెబ్బ కొడుతున్న భారత ప్రభుత్వం ప్రపంచం ముందు చైనా ఆగడాలను చూపిస్తూ దోషిగా నిలబెడుతోంది. చైనా కూడా భారత సరిహద్దులలో బలగాలను మొహరిస్తూ కయ్యానికి కాలుదువ్వుతోంది. ఈ నేపద్యంలో

భారత రక్షణ విభాగం ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ చైనాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనాతో యుద్ధం గనుకా జరిగితే భారత వైమానిక దళం (ఐఏఎఫ్) పై చేయి సాధిస్తుందని బల్ల గుద్ది మరీ చెప్పారు. భారత వైమానిక దళం ఎలాంటి పరిస్థితులను అయినా తట్టుకుని నిలబడుతుందని ప్రకటించారు.

IAF: RKS Bhadauria, man who led Rafale talks, is IAF Chief

ఈ నెల 8వ తేదీన జరగనున్న భారత వైమానిక దినోత్సవం సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎయిర్ చీఫ్ మార్షల్ బదౌరియా ఈ వ్యాఖ్యలు చేశారు. లడక్ లో భారత్ వైమానిక దళంతో పోల్చితే చైనా పూర్తిగా వెనుకపడి ఉందని స్పష్టం చేశారు. రాఫెల్ యుద్ద విమానాలు మన సైన్యంలో చేరడంతో మన శత్రువులకంటే కూడా మనం బలమైన శక్తిగా మారామని తెలిపారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *