అమెరికాలో “భారత ఎన్నారైల”  ఫండ్ రైజింగ్ కు భారీ స్పందన..!!

అమెరికాలో భారతీయుల ఉనికికి కొదవేలేదు. ప్రపంచ వ్యాప్తంగా అమెరికా వెళ్ళే వలస వాసులల్లో అత్యధికంగా భారతీయుల సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. భారత్ నుంచీ వెళ్ళిన వలస వాసులు అమెరికాలో పలు రంగాలలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాదు భారతీయులు నివాసం ఉండే కొన్ని రాష్ట్రాలలో, ప్రాంతాలలో మన వారి ఓట్లే అత్యంత కీలకంగా ఉండటంతో పలు రాజకీయ పార్టీలు సైతం మన వారికి రెడ్ కార్పెట్ పరుస్తుంటాయి. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తన టీమ్ లో అత్యధికంగా భారతీయులను నియమించుకున్నారంటే భారతీయుల ప్రభావం అక్కడి వ్యవస్థలపై ఏ స్థాయిలో ఉందొ అర్థం చేసుకోవచ్చు. తాజాగా

Indo American | Zee News Telugu

అమెరికాలోని డెట్రాయిట్ లో గవర్నర్ ఫండ్ కోసం భారతీయ ఎన్నారైలు అందరూ కలిసి ఏర్పాటు చేసిన కార్యక్రమం బిగ్ సక్సస్స్ అయ్యింది. అక్కడి గవర్నర్ గ్రెట్ చెన్ విట్మర్ కోసం ఫండ్ రైజింగ్ ఏర్పాటు చేశారు. డెట్రాయిట్ లోని మోసోనిక్ టెంపుల్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి భారీగా భారతీయ ఎన్నారైలు తరలి వచ్చారు. సుమారు 500 మంది ఎన్నారైలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గవర్నర్ గ్రెట్ చెన్ విట్మర్ తో పాటు, మిచిగాన్ స్టేట్ సెక్రటరీ బెన్సన్, కాంగ్రెస్ మహిళ స్టీవెన్ విచ్చేశారు. ఇదిలాంటే

గవర్నర్ ఫండ్ కోసం చేపట్టిన విరాళాల సేకరణలో భారత ఎన్నారైల బిజినెస్ కమ్యూనిటీ భారీ మొత్తంలో విరాళాలు సేకరించింది. సుమారు 500 మంది ఈ కార్యక్రమంలో పాల్గొనగా దాదాపు 238 వేల డాలర్లు విరాళంగా అందాయి. భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో గవర్నర్ గ్రెట్ చెన్ విజయం సాధించడం ఖాయమని, భారతీయులు అందరూ ఎకమయ్యి  గ్రెట్ చెన్ గెలిపించుకోవాలని ఎన్నారై ప్రతినిధుల సంఘం పిలుపునిచ్చింది. భారతీయులు అందరూ ఇలాంటి సభలతో హాజరయినప్పుడు మాత్రమే మనబలం నిరూపించబడుతుందని సంస్థ సభ్యులు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన గవర్నర్ గ్రెట్ చెన్ భారతీయ ప్రవాసులకు కృతజ్ఞతలు తెలిపారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *