పశ్చిమలో ఐటీ దాడులు..??..ఆ నేతలే టార్గెట్..??

తెలంగాణలో రేవంత్ పై అలాగే పలువురు నేతలపై జరిగిన ఐటీ దాడులు ఓటుకు నోటు కోణంలో జరుగుతున్నాయని గత రెండు రోజులుగా వార్తలు వింటూనే ఉన్నాము అయితే ఏపీలో కూడా ఐటీ అధికారుల దాడులు జరుగుతాయని నేతలు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు ముందుగానే తమ నేతలని హెచ్చరించారు అయితే నిన్న అర్థరాత్రి చెన్నై, బెంగుళూరు ,హైదరాబాదు నుంచీ విజయవాడ చేరుకున్న ఐటీ అధికారులు కీలక నేతలు, పారిశ్రామికవేత్తల ఇళ్ళపై దాడులు మొదలు పెట్టారు..

Image result for it raid ap

ఈ క్రమంలోనే గురువారం నెల్లూరులో టీడీపీ నేత బీద మస్తాన్‌రావు కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించిన విషయం విదితమే సోదాలు పూర్తి కాగానే అన్ని విషయాలు మీడియా ముఖంగా వెల్లడిస్తామని అధికారులు తెలిపారు..ముఖ్యంగా కృష్ణా, గుంటూరులో ఈ దాడులు చేస్తారని తెలుస్తోంది అయితే అనూహ్యంగా నేతలు అటు శ్రీకాకుళం జిల్లా తూగో లోని కాకినాడ లో కూడా దాడులు చేస్తున్నారట. ఇదిలాఉంటే

Image result for it raid ap

అధికార పార్టీకి అధికారం తెచ్చి పెట్టిన పశ్చిమగోదావరి జిల్లాలో సైతం ఐటీ అధికారులు దాడులు నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా భీమవరం, ఏలూరు ప్రాంతాల పరిధిలో ఈ దాడులు జరుగానున్నట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి..ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ లకి ఎంతో దగ్గర వ్యక్తులు అయిన కొందరు వ్యక్తులపై ఈ దాడులు జరుగనున్నాయని పోలవరం విషయంలో పశ్చిమ గోదావరి జిల్లాలో కీలక అధికారులని కూడా ప్రశ్నించే అవకాశం ఉందని టాక్ బలంగా వినిపిస్తోంది.

 

 

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *