పీకే మాస్టర్ ప్లాన్……టీడీపీ లో గుబులు

నంద్యాల ,కాకినాడ ఎన్నికల తరువాత వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ ని పక్కన పెట్టేశారు అని వార్తలు చాలానే వచ్చాయి. వైసీపిలో చాలా మంది నాయకులు ఇలానే భావించారు. కానీ అందరి అంచనాలని తారుమారు చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ అయ్యింది.ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు వైసీపీలో మరింత కీలకంగా మారబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి వైసీపి వర్గాలు. ఈ విషయంలో జగన్ నేతలకి శనివారం పీకే విషయంలో స్పష్టత ఇచ్చారట.

prashant kishor ysrcp కోసం చిత్ర ఫలితం

నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటమి పాలయినంత మాత్రాన ప్రశాంత్ కిషోర్ వ్యూహం పనిచేయలేదని అనుకోవడం సరికాదని .నంద్యాల ఎన్నికల్లో పార్టీ పరిస్థితి కష్టంగా ఉందని తనకు ముందే పీకే చెప్పారని సీనియర్ నేతలతో జగన్ అన్నారని సమాచారం. పీకే కి మరిన్ని కీలక భాద్యతలు అప్పగిస్తున్నట్ట్టు గా కూడా అయన చెప్పారట. అదే సమయంలో ప్రశాంత్ కిషోర్ పై వైసీపి నేత వాసిరెడ్డి పద్మ చేసిన కామెంట్స్ విషయంలో కూడా క్లాసు పీకినట్టు తెలుస్తోంది.  దీంతో జగన్ పీకేని పక్కన పెట్టారు అన్న పుకార్లకీ తేరా దించారు జగన్.

prashant kishor ysrcp కోసం చిత్ర ఫలితం

 వైసీపిలో ఇక పీకే తన పవర్ చూపించ బోతున్నాడు అని తెలుస్తోంది.జగన్మోహన్ రెడ్డి కి వచ్చే ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించేలా ప్రణాళికని ఇప్పటికే రచించాడు అని టాక్ .అందుకోసం తానూ ప్రత్యేకంగా టీమ్స్ ని తయారుచేస్తున్నాడట. పోలింగ్ బూత్ ల వారీగా పది మంది కార్యకర్తలను ఎంపిక చేసి వారికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని జగన్ పీకే కి అప్పచెప్పినట్లు తెలుస్తోంది. ఒక్కొక్క పోలింగ్ బూత్ నుంచి పది మంది వైసీపీ కార్యకర్తలను ఎంపిక చేసి వారికి పోలింగ్ మేనేజ్ మెంట్ పై స్వయంగా ప్రశాంత్ కిషోర్ శిక్షణ ఇవ్వనున్నారు. ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది .

prashant kishor ysrcp కోసం చిత్ర ఫలితం

అంతేకాదు వైసీపి నేతలు ప్రెస్ మీట్స్ పెట్టాలి అంటే తప్పకుండ పీకే  సలహాలు సూచనల మేర నిర్ణయం తీసుకోవాలని  జగన్ తేల్చి చెప్పేశారు. పేకే తన టీం తో అన్నీ నియోజకవర్గాలలో సర్వేలు చేయిస్తూ అభ్యర్ధుల ఎన్నిక చేయడం చాలా మంది నేతలకి మింగుడు పడకపోయినా జగన్మోహన్ రెడ్డి కి అధికారం లోకి తీసుకురావడానికి ఇలాంటివి తప్పదని పేకే కొంతమంది నేతలకి చెప్పినట్టు సమాచారం. ఇప్పటికే దాదాపు 70 నియోజకవర్గాల్లో సర్వే పూర్తయినట్లు తెలుస్తోంది. జగన్ చేపట్టబోతున్న పాదయత్రకి సంభందించి గ్రౌండ్ వర్క్ మొత్తం పేకే అండర్ లోనే నడుస్తోందట. పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లను కూడా పీకే యే చూస్తున్నారు. మొత్తానికి పీకే జగన్మోహన్ రెడ్డి విషయంలో చాలా సీరియస్ గా వర్క్ చేస్తున్నారు అని చెప్తున్నారు.ఈ మొత్తం పరిణామాలని నిశితంగా పరిశీలిస్తున్న టీడీపికి గుండెల్లో గుబులు మొదలయ్యింది అని టాక్..ఎమ్ జరుగుతుందో…వెయిట్ అండ్ సి

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *