జ‌గ‌న్ సీఎం…రోజా హోం మినిస్ట‌ర్‌..

ఏపీలో టీడీపీని, సీఎం చంద్ర‌బాబును బాగా టార్గెట్ చేసే వైసీపీ వాళ్ల‌లో ఫైర్‌బ్రాండ్ రోజాకు ఫ‌స్ట్ ర్యాంక్ ఇచ్చేయొచ్చు. చంద్ర‌బాబును అస‌భ్య ప‌ద‌జాలంతో కూడా దూషించి అసెంబ్లీ నుంచి స‌స్పెండ్ అయిన రోజా అయినా అదే దూకుడు కంటిన్యూ చేస్తోంది. తాజాగా అమ‌రావ‌తిలో జ‌రిగిన ప్లీన‌రీలోను రోజా బాబు, టీడీపీపై అదే దూకుడుతో ప్ర‌ద‌ర్శించి వైసీపీ, జ‌గ‌న్ నుంచి ప్ర‌శంస‌లు పొందారు.
ఇక ట్విస్ట్ ఏంటంటే సీనియ‌ర్ నేత ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు అయితే రోజా ప్ర‌సంగం స్టార్ట్ అయిన వెంట‌నే చంద్ర‌బాబును జ‌గ‌న్ తిట్ట‌మ‌న్నారని ఆమె చెవిలో ఊద‌డం మైక్ సాక్షిగా అంద‌రూ వినేశారు. దీనిని బ‌ట్టి చంద్ర‌బాబును తిట్టేందుకు జ‌గ‌న్ సైతం రోజాను ఎలా వాడుకుంటున్నారో ఓపెన్‌గానే అంద‌రికి తెలిసిపోయింది.
ఇదిలా ఉంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచి జ‌గ‌న్ సీఎం అయితే రోజాకు జ‌గ‌న్ అదిరిపోయే ఆఫ‌ర్ కూడా ఇస్తార‌ని వైసీపీ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. జ‌గ‌న్ సీఎం అయితే , రోజా హోం మినిస్ట‌ర్ అవుతుంద‌ని వైసీపీ వ‌ర్గాల ఇన్న‌ర్ టాక్‌. గ‌తంలో వైఎస్ జ‌గ‌న్ తండ్రి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి రెండోసారి సీఎం అయ్యాక తెలంగాణ మహిళా నేత అయిన సబితా ఇంద్రారెడ్డికి హోంమంత్రి పదవి కట్టబెట్టారు.
ఇప్పుడు జ‌గ‌న్ కూడా రోజాను హోం మినిస్ట‌ర్ చేస్తార‌న్న చ‌ర్చ వైసీపీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. అయితే జ‌గ‌న్ రెడ్డి, మ‌రి హోం మంత్రి కాపుల‌కు, బీసీల‌కు కాకుండా రెడ్డి అయిన రోజాకే ఇచ్చే సాహ‌సం జ‌గ‌న్ చేస్తారా ? అన్న‌ది కూడా పాయింటే. అయినా ఇదంతా వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక సంగ‌తి క‌దా ? అని మ‌రి కొంద‌రు లైట్ తీస్కొంటున్నారు.
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *