జగన్ కి స్వల్ప అస్వస్థత..అయినా కాకినాడకి

14 రోజులు సుదీర్గంగా, నిర్విరామంగా జగన్ నంద్యాలలో  చేసిన ఎన్నికల  ప్రచార పర్యటన ప్రశాంతంగా ముగిసింది.ఈ ఉపఎన్నికల్ని వైఎస్సార్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతీ పల్లె పల్లెకి తిరిగి ప్రచారం చేశారు. అందుకు కారణం అందుకు కారణం తెలుగుదేశం పార్టీనే. టీడీపీ ముందుగా ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం మొదలుపెట్టడంతో వైసీపీ కూడా అదే బాటనే అనుసరించింది.

nandyal jagan కోసం చిత్ర ఫలితం

 మరి అలాంటి ప్రచారం పనులతో జగన్ కొంత అస్వస్థతకు గురి అయినట్టుగా తెలుస్తోంది. జగన్ కు తీవ్రమైన ఇబ్బంది కాకపోయినా , జలుబు తలనొప్పితో ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తోంది. నంద్యాల నుంచి వచ్చినప్పటి నుంచి జగన్ కు అస్వస్థత అని సమాచారం.అయినా సరే నంద్యాల గెలుపు మీదనమ్మకం ఉన్న జగన్,అదే జోరులో రేపటి నుంచి కాకినాడలో ప్రచారం చేయబోతున్నాడు అని సమాచారం.

nandhyla jagan road show కోసం చిత్ర ఫలితం

నంద్యాల గెలుపు మీద ధీమాగా ఉన్న వైఎస్సార్ పార్టీ నాయకులు.కాకినాడ గెలుపు మీద తమకి పూర్తి స్థాయి నమ్మకం ఉంది అని, 26,27వ తేదీలలో  జగన్ కాకినాడలో పర్యటించబోతున్నాడని,ప్రచారాన్ని చేయబోతున్నాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అయితే 28 వ తేదీ పోలింగ్ కు విరామం కాగా, 29 వ తేదీన కాకినాడలో పోలింగ్ జరగనుంది.

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *