ప్ర‌శాంత్ కిషోర్‌కు జ‌గ‌న్ షాక్‌..

వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇటీవ‌ల చాలా మారాడంటూ ఒక్క‌టే ప్ర‌చారం మొద‌లైంది. వైసీపీ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా నియ‌మితులైన ప్ర‌శాంత్ కిషోర్ చెప్పిన‌ట్టే జ‌గ‌న్ చేస్తున్నార‌ని అంద‌రూ అనుకున్నారు. పీకే ఎఫెక్ట్‌తో జ‌గ‌న్‌లో చాలా చాలా మార్పులు వ‌చ్చాయ‌ని చాలా మంది న‌మ్ముతున్నారు. జ‌గ‌న్ ఇటీవ‌ల పార్టీలో సీనియ‌ర్ల‌ను గౌర‌వించ‌డం, ఎన్డీయే రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు పాదాభివంద‌నం చేయ‌డంతో జ‌గ‌న్‌లో ఇంత సౌమ్య‌త్వ మార్పు ఏంట‌బ్బా ? అని ప్ర‌తి ఒక్క‌రు షాక్ అయ్యారు. పీకే ఎఫెక్ట్ జ‌గ‌న్‌పై చాలా వ‌ర‌కు ప‌ని చేసింద‌ని అంద‌రూ అనుకున్నారు.
అయితే అప్పుడే పీకేకు జ‌గ‌న్ షాక్ ఇచ్చేసిన‌ట్టు తెలుస్తోంది. పీకే చెప్పిన ఓ అంశాన్ని జ‌గ‌న్ అప్పుడే ప‌క్క‌న పెట్టేశారు.  ప్ర‌శాంత్ 22 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల‌తో పాటు 2 ఎంపీల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్లు ఇవ్వ‌వ‌ద్ద‌ని చెప్పాడ‌ట‌. వీరి ప‌నితీరు నియోజ‌క‌వ‌ర్గాల్లో చాలా చాలా వీక్‌గా ఉండ‌డంతో పాటు చాలా మంది నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జ్‌ల‌ను కూడా త‌ప్పించి కొత్త వాళ్ల‌కు టిక్కెట్లు ఇస్తే త‌ప్ప మ‌నం గెల‌వ‌మ‌ని పీకే జ‌గ‌న్‌కు చెప్పార‌ట‌.
అయితే ఈ విష‌యంలో పీకేకు షాక్ ఇచ్చేశాడ‌ట జ‌గ‌న్‌. గ‌త‌ మూడేళ్లలో వైసీపీ నుంచి 16 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అయ్యారు. మిగిలిన వారు పార్టీని, తనను నమ్ముకుని ఉన్నారని …వీరిని మీ మాట‌తో ప‌క్క‌న పెట్ట‌లేన‌ని జ‌గ‌న్ పీకేకు చెప్పార‌ట‌. వీరికి ఓ ఛాన్స్ ఇచ్చి చూద్దామ‌ని, ఆ త‌ర్వాత మ‌రోసారి వీరి ప‌నితీరుపై స‌ర్వే చేద్దామ‌ని, అప్ప‌ట‌కీ ప‌నితీరు స‌రిగా లేక‌పోతే ప‌క్క‌న పెడ‌దామ‌ని ప్ర‌శాంత్‌తో జ‌గ‌న్ చెప్పిన‌ట్టు తెలుస్తోంది.
ప్ర‌శాంత్ కిషోర్ చెప్పిన కీల‌క నిర్ణ‌యాన్ని సైతం జ‌గ‌న్ కాద‌న‌డంతో ఇక వ‌చ్చే రెండేళ్ల‌లో వీరి మ‌ధ్య సయోధ్య ఎలా ఉంటుంది ?  పీకే విష‌యాల‌ను జ‌గ‌న్ ఎంత వ‌ర‌కు ఫాలో అవుతాడ‌న్న సందేహాలు అప్పుడే స్టార్ట్ అయ్యాయి.
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *