ధవళేశ్వరం కింద “జల గోదారి”..పైన  “జన గోదారి”..!!!

జనసేన కవాతు తెలుగు రాష్ట్రాల చరిత్రలో చెదిరిపోని చరిత్రగా భారీ  రికార్డ్ సృష్టించడానికి సిద్దమవుతోంది. ధవళేశ్వరం కింద “జల గోదారి” పరవళ్ళు తొక్కుతుంటే పైన జనసేన సైనిక  గోదారి ఉరకలు పెడుతోంది..ఒక పక్క జనసైనికుల  కవాతు  మరో పక్క హోరెత్తుతున్న నినాదాలు..ఇసుకేస్తే రాలనంత జనం…అందరి నోటా ఒకటే నినాదం పవన్ సీఎం. ఈ చప్పుళ్ళు..హోరెత్తుతున్న నినాదాలతో ధవళేశ్వరం కొత్త రూపు సంతరించుకుంది.

Image result for janasena kavathu images

కొద్ది నిమిషాల క్రితమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కవాతు ప్రారంభించడానికి సిద్దమయ్యారు..ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు అందరూ ఈ కవాతు పై ప్రత్యేక ఎంతో ఆశక్తిని కనబరుస్తున్నారు..అంతేకాదు కేంద్రం కవాతుపై ఎప్పడికప్పుడు సమాచారాన్ని తెప్పిస్తోందట..పవన్ కళ్యాణ్ కోసం ఏపీ రాష్ట్రం నుంచీ మాత్రమే కాకుండా తెలంగాణా నుంచీ కూడా వేల సంఖ్యలో అభిమానులు తరలి వచ్చినట్టుగా తెలుస్తోంది..పిచ్చుక లంక నుంచీ  మొదలయిన కవాతు అశేష అభిమానులతో , జనసేన పార్టీ కార్యకర్తలతో హోరెత్తుతోంది.

Image result for janasena kavathu images

జనసేనుడి ఒక్క పిలుపుతో ఈ కవాతు కోసం దాదాపు 2 లక్షల పై చీలుకు ప్రజలు హాజరయ్యి ఉంటారని అంచనాకి వచ్చారు పార్టీ నేతలు ఈ అంచనాలు మరింత మించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది..అయితే కేలవం పశ్చిమ గోదావరి నుంచే లక్ష మంది అభిమానులు కార్యకర్తలు కవాతు కి వెళ్లారని  లెక్కలు వేస్తున్నారు..జనసేన కవాతులో ఎవరికి ఎటువంటి ఆపద రాకుండా అడుగడుగునా రక్షణ చర్యలు చేపట్టారు పార్టీ నేతలు.

Image result for janasena kavathu images

ఈ కవాతులో మరొక విషయం ఏమిటంటే. పవన్ కళ్యాణ్ తో పాటు అన్ని కులాలవారు తమ తమ వృత్తుల వేష ధారణలో పవన్ తో పాటు నడవనున్నారని తెలుస్తోంది…ఇప్పటికే వేల సంఖ్యలో జనం ధవళేశ్వరం బ్రిడ్జ్ పైన కవాతు చేయడాని సిద్దమయ్యి పోయారు..మరో పక్క సభాస్థలి వద్ద జనసేన నేతలు అభిమానులని ఉద్దేశించి ప్రసంగాలు చేస్తూ కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపుతున్నారు.

 

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *