టీడీపీ ఫ్లేక్సీకి …”జనసైనికుడి” దిమ్మతిరిగే కౌంటర్..!!

జనసేన  అధినేత పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తూ..తీవ్ర ఆరోపణలు చేస్తూ కాట్రగడ్డ బాబు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఏపీలో ఎంత రచ్చ రచ్చ చేసిందో వేరే చెప్పనవసరం లేదు..ఈ ఎఫెక్ట్ తో జనసేన సైనికులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు అయితే జనసేన అధినేత పై ఎటువంటి అపఖ్యాతి రాకుండా ఉండాలని భావించిన జనసైనికులు టీడీపీ అధినేత చంద్రబాబు కి వ్యతిరేకంగా ఫ్లేక్సీలని ఏర్పాటు చేశారు..ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం సంచలనం సృష్టిస్తోంది.

తమ అధినేత పైనే విమర్శలు చేస్తారా కాచుకోండి అన్నట్టుగా ఈరోజు విజయవాడలో జనసేన సైనికుడు,పార్టీ అధికార ప్రతినిధి  అయిన మండలి రాజేష్ ఏర్పాటు చేయించిన ఫ్లేక్సీలు విజయవాడ నగరమంతా విస్తరించాయి..టీడీపీ  పార్టీకి ఘాటైన కౌంటర్ ఇస్తూ విజయవాడ నగరంలో భారీ జనసేన ఫ్లెక్సీ బుధవారం వెలిసింది…అక్కడక్కడ ఈ ఫ్లెక్సీలని ఏర్పాటు చేశారు కూడా…ఆ ఫ్లేక్సీలో  “పిచ్చి ముదిరిన పచ్చ పురాణం.. ఏం తమ్ముళ్లు వేధిస్తుందా..ఓటమి భయం, గుర్తుస్తోందా..

దశాబ్ధ ప్రతిపక్ష కాలం.”  అంటూ ఫ్లెక్సీలో టీడీపీకి పాత జ్ఞాపకాలను గుర్తు చేశారు.పచ్చ పేపర్లకి ఎక్కువ సింగల్ డిజిట్ కి తక్కువ ,2019 ఈ గతి పట్టించాకుంటే మేము జనసైనికులం కాదు అంటూ ఫైర్ అయ్యారు…ఖబడ్దార్ తెలుగు తమ్ముళ్ళు గోదావరిలో మొదలయ్యింది మీకు కౌంట్ డౌన్ అంటూ ఏర్పాటు చేసిన ఫ్లేక్సీలు టీడీపీ కి దిమ్మతిరిగే కౌంటర్ ఇస్తున్నాయి.

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *