అభ్యర్ధుల “మొదటి లిస్టు” సిద్దం చేసిన…జనసేన??

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే రానున్న ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తాడా లేదా అన్ని స్థానాలలో పోటీ చేస్తారా అనే సందేహం అందరిలోనూ ముఖ్యంగా ఆ పార్టీ నేతలలో కూడా ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో పవన్ కి తప్ప ఆ పార్టీలో ఎవరికీ తెలియని విషయమే అయితే ఎన్నో సార్లు విలేఖరులు పొత్తు ఉందా లేదా అని అడిగిన ప్రశ్నలకి నేను ఒంటరినే అంటూ పవన్ కళ్యాణ్ చెప్పేవారు.దాంతో శ్రేణులు కూడా జనసేన యుద్ధం ఒంటరిగానే పొత్తుల్లేవ్ అని ఫిక్స్ అయిపోయారు అయితే

Image result for janasena

విశ్వసనీయ వర్గాల సమాచారమంటూ  ఇప్పుడు ఒక వార్తా హల్చల్ చేస్తోంది అదేంటంటే..పవన్ కళ్యాణ్ జనసేన తరుపున పోటీ చేసే అభ్యర్ధుల మొదటి జాబితా ఇదేనని..దాదాపు పవన్ కళ్యాణ్ ఈ పేర్లు ఖారారు చేసేశారని టాక్ వినిపిస్తోంది..దాంతో పవన్ పార్టీ అభ్యర్ధుల లిస్ట్ తో కొన్ని పేర్లు సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతున్నాయి ఈ వార్తల్లో ఎంతవరకూ నిజముందనేది తరువాత విషయం అయితే వీరు అభ్యర్ధులుగా ఉంటే తప్పకుండా పవన్ పార్టీ గెలుపు ఖాయం అనే వార్తలు వినిపిస్తున్నాయి..సరే ఆ అభ్యర్ధుల లిస్టు పై మీరు ఓ లుక్కేయండి..

Image result for bjp ysrcp

త్వరలో జనసేన పార్టీలో వివిధ పార్టీల కీలక నేతలు చేరుతున్నారని వారిలో చాలా మంది బీజేపీ నుంచీ వచ్చే అవకాశముందని తెలుస్తోంది..అయితే అభ్యర్ధుల మొదటి లిస్టు లో ఆరుగురు ఎంపీ తిమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారని తెలుస్తోంది..వీరిలో బిజెపికి చెందిన సీనియర్‌ నాయకులు దగ్గుబాటి పురంధేశ్వరి,  సోము వీర్రాజు, ఆకుల సత్యనారాయణలు ఉన్నారు…అంతేకాదు వైకాపాకు చెందిన ‘వంగవీటి రాధా, జాన్‌వెస్లీ  తదితరుల పేర్లు కూడా వినిపిస్తున్నాయని కొన్ని వర్గాలు ప్రచారం చేస్తున్నాయి..అయితే  “విజయవాడ”  నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త  “పొట్లూరి వరప్రసాద్‌” , గుంటూరు నుంచి “లింగమనేని రమేష్‌” ,  మచిలీపట్నం నుంచి పవన్ అన్నయ్య నాగబాబు…అలాగే ఏలూరు నుంచి తోట చంద్రశేఖర్‌,  ఒంగోలు నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి, కాకినాడ నుంచి ‘సోము వీర్రాజు’లు పార్లమెంట్‌ అభర్యులుగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

Image result for pavan meeting

ఇక విజయవాడ తూర్పు నుంచి కోగంటి సత్యం పేరు వినిపిస్తుండగా , విజయవాడ సెంట్రల్‌ నుంచి వంగవీటి రాధా, కి టిక్కెట్ ఖరారు అయినట్టుగా తెలుస్తోంది… నందిగామ నుంచి జాన్‌ వెస్లీ, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్‌, మైలవరం నుంచి కాజా రాజకుమార్‌, గుంటూరు-2 నుంచి లేళ్ల అప్పిరెడ్డి , రాజమండ్రి నుంచీ ఆకుల సత్యనారాయణ,   కొత్తపేట నుంచి , నల్లా పవన్‌కుమార్‌,  పర్చూరు నుంచి “దగ్గుబాటి వెంకటేశ్వరరావు” అలాగే పశ్చిమ ఆచంట నుంచీ మల్లుల లక్ష్మీనారాయణ పేర్లు వినిపిస్తున్నాయి..అయితే ఈ విషయంలో జనసేన నుంచీ ఎటువంటి అధికారిక ప్రకటన వేలువడలేక పోయినా ఈ లిస్టు లో ఉన్న అభ్యర్ధులు పక్కాగా పోటీలో ఉంటారని తెలుస్తోంది

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *