జనసేన కీలక కమిటీ ప్రకటన..!!!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరొక అడుగు ముందుకు వేశారు. అభ్యర్ధుల ఎంపికలో అత్యంత కీలకంగా వ్యవహరించే స్క్రీనింగ్ కమిటినీ ఈరోజు ప్రకటించారు. అయిదుగురు సభ్యులతో ఏర్పాటైన ఈ కమిటీ ఏ విధంగా పని చేస్తుందనే మార్గదర్శకాలను, విధి విధానాలను పకడ్బందీగా రూపొందించారు. లోక్ సభ, శాసన సభలకు పోటీ చేయాలనుకొనే అభ్యర్థుల ప్రొఫైల్స్,  వివరాలను, వారి రాజకీయ నేపథ్యాన్ని స్క్రీనింగ్ కమిటీ పరిశీలిస్తుంది..స్క్రీనింగ్ కమిటీ అనేది అభ్యర్థిత్వాన్ని ఆశించేవారి వివరాలను పరిశీలించేందుకే. అభ్యర్థిత్వానికి సంబంధించిన నిర్ణయాధికారం ఈ కమిటీది కాదు. అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ తమ ముందుకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి… అర్హుల ఎంపికకు నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం వడపోత ప్రక్రియ చేపడతారు.

 అభ్యర్థికి వ్యక్తిగతంగా ఉన్న బలం

–  గెలిచే సమర్థత

–  ఎన్నికల్లో పోరాడే శక్తి, ప్రత్యర్థిని ఎదుర్కొనే సమర్థత

–  ప్రజా సమస్యల పరిష్కారంపైనా, సామాజిక అంశాలపై స్పందన, నిబద్దత

ఈ ప్రమాణాల ప్రకారం వడపోత చేసిన తరవాత అర్హులైన వారి వివరాలను జనసేన జనరల్ బాడీకి స్క్రీనింగ్ కమిటీ అందచేస్తుంది. అభ్యర్థి ఎంపికకు సాధికారత  జనసేన జనరల్ బాడీ మాత్రమే కలిగి వుంది.

ఈ స్క్రీనింగ్ కమిటీ ఏమి చేస్తుందంటే…

స్క్రీనింగ్ కమిటీ నుంచి తమ ముందుకు వచ్చిన అభ్యర్థులపై చేపట్టిన సర్వే వివరాలను జనరల్ బాడీ పరిశీలిస్తుంది.అభ్యర్థిత్వాన్ని ఆశించేవారి సమాచారం, గెలుపు అవకాశాలుపార్టీకి చెందిన సర్వే బృందాలు సేకరిస్తాయి. ఈ వివరాలూ జనరల్ బాడీ ముందు ఉంటాయి. విజయం సాధించే అభ్యర్థులను గుర్తించి ఎంపిక చేయడమే ఏకైక లక్ష్యంగా జనసేన జనరల్ బాడీ విధులు నిర్వర్తిస్తుంది. ఈ ఎంపికకు అంతిమ బాధ్యత జనరల్ బాడీ తీసుకుంటుంది. ప్రతి స్థానంలో ఎంపికకీ, ఎంపిక చేయకపోవడానికి గల సహేతుక కారణాలను జనరల్ బాడీ వివరిస్తుంది. కూటమిలో ఇచ్చే స్థానాలను కూడా జనరల్ బాడీ గుర్తిస్తుంది.

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *