రివ్యూ: జ‌య జాన‌కి నాయ‌క‌..

జాన‌ర్‌: ఫ‌్యామిలీ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌

న‌టీన‌టులు:  బెల్లంకొండ శ్రీనివాస్‌, ర‌కుల్‌ప్రీత్‌సింగ్‌, ప్ర‌గ్య జైశ్వాల్‌, కేథ‌రిన్ థెస్రా, జ‌గ‌ప‌తిబాబు, త‌రుణ్ అరోరా త‌దిత‌రులు

బ్యాన‌ర్‌: ద్వార‌కా క్రియేష‌న్స్‌

మ్యూజిక్‌: దేవిశ్రీ ప్ర‌సాద్‌

నిర్మాత‌లు: మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి

ద‌ర్శ‌క‌త్వం: బోయ‌పాటి శ్రీను

సెన్సార్ రిపోర్ట్‌:  యూ/ఏ

ర‌న్ టైం: 149 నిమిషాలు

రిలీజ్ డేట్‌: 11 ఆగ‌స్టు, 2017

 బెల్లంకొండ శ్రీనివాస్  ఇంతకముందు నటించిన   సినిమాలు అల్లుడు శ్రీను,స్పీడున్నోడు ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి అయితే ఈ సారి తన మూడవ సినిమాని బోయపాటి దర్సకత్వం తో  పక్క ప్లాన్ గా జయజానకీ నాయకతో రకుల్ హీరోయిన్ గా మాస్ ఆడియన్స్ ని మెప్పించే విధంగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ సినిమా బోయపాటి అంచనాలని అందుకునేలా ఉందా లేదా అనేది చూద్దాం

కథ విషయానికొస్తే.. డేరింగ్ అండ్ డ్యాషింగ్ హీరో శ్రీను ఎంట్రీ ఇవ్వడమే కాలేజ్ లో టీజింగ్ చేస్తున్న హీరోయిన్ ను కాపాడుతాడు. ఇక అక్కడే మొదటి ఇంప్రెషన్ కొట్టేస్తాడు  హీరో..తరువాత హీరోయిన్ అతని ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలని చూస్తుంది. రకుల్ మొదట శ్రీనుని మోసం చేయాలని చూసినా ఆ తర్వాత అతన్ని నిజంగానే ఇష్టపడుతుంది. అత్యంత కిరాతకమైన తండ్రి అయిన  జగపతి బాబు తన కూతిరినే చంపాలని చూస్తాడు. ఈ క్రమంలో రకుల్ శ్రీనుకి ప్రపోస్ చేస్తుంది. కాని శ్రీను తండ్రి శరత్ కుమార్ అందుకు ఒప్పుకోడు. మొత్తనికి రకుల్ రిస్క్ లో ఉందని తెలుసుకుని ఆమెని ఎలా కాపాడాడు అన్నది అసలు కథ.

 బెల్లంకొండ శ్రీను ని నటనపరంగా చుస్తే  ఎమోషనల్ సీన్స్ లో ఇంకా పరిణితి చెందాల్సి ఉంది. ఫైట్లు డ్యాన్స్ ల విషయంలో శ్రీను ప్రేక్షకులని మెప్పించాడు . ఇక రకుల్ ప్రీత్ సింగ్ అయితే మరోసారి ఇంప్రెస్ చేసింది. తనకు ఇచ్చిన పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేసింది గ్లామర్ హీరోయిన్ అనే కాకుండా చక్కటి హావభావాలు పలికించడంలో రకుల్ అందరిని మెప్పించింది  . శరత్ కుమార్, జగపతి బాబు, ప్రగ్యా జైశ్వాల్.  వారి పాత్రలకు తగ్గట్టుగా నటించి మెప్పించారు

ప్ల‌స్ పాయింట్స్ (+):

– బోయపాటి శ్రీను డైరక్షన్

– బెల్లంకొండ శ్రీను డ్యాన్స్ అండ్ ఫైట్స్

– రకుల్ ప్రీత్ సింగ్

– యాక్ష‌న్ సీన్లు

– నిర్మాణ విలువ‌లు

– టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్స్‌

మైనస్ పాయింట్స్(-):

– హీరో ఎక్స్‌ప్రెష‌న్స్‌

– ఉహాజ‌నిత‌మైన క‌థ‌

రేటింగ్ -౩.25

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *