“జేడీ” రాజీనామా  వెనుక కారణాలు ఇవేనా….??

మాజీ సీబీఐ ఆఫీసర్ జేడీ వీవీ లక్ష్మీ నారాయణ తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు జనసేనలో కలకలం రేపింది. జేడీ ఎంతో, నిబద్దత, నియజయతీ కలిగిన ఆఫీసర్. 2018 లో ఆయన సీబీఐ పదవికి స్వచ్చందంగా పదవీ విరమణ చేశారు. అయితే స్వతహాగా ప్రజలకు మేలుచేయలన్న ఆలోచన ఉన్న జేడీ రాజకీయ ప్రవేశం చేసే ఆలోచనలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పేరున్న పార్టీలన్ని ఆయనకు స్వాగతం పలికాయి. కాని జేడీ మాత్రం, ఎలాంటి రాజకీయ అనుభవం లేకున్నా, పవన్ కళ్యాణ్ స్థాపించిన  “జనసేన”నే ఎంచుకున్నారు. ఎందుకంటే పవన్ నిజాయితీగా ప్రజలకు మంచి చేస్తారన్న నమ్మకంతోనే..

 

జనసేనాని కూడా జేడీ కు అంతే ప్రాముఖ్యత  ఇచ్చారు. తన పార్టీ తరుపున జేడీని విశాఖ జిల్లాలో ఎంపిగా పోటీ చేయించారు. ఈ ఎన్నికల్లో జేడీ ఓటమి పాలయ్యారు. అయినా సరే పార్టీ కోసం ఎంతో శ్రమించిన జేడీ తాజాగా జనసేన పార్టీకి రాజీనామా చేయడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. అయితే  రాజీనామా చేస్తూ జేడీ చేసిన వ్యాఖ్యలు    సంచలనంగా మారాయి. పార్టీ స్థాపన సమయంలో పవన్ ఇక సినిమాలు చేయనని రాజకీయాలకే పరిమితం అని మాట ఇచ్చి, ఇప్పుడు ఆ మాటను పక్కకి నెడుతూ  పవన్ మళ్ళీ నటించటం తనకి నచ్చలేదని అందుకే రాజీనామా చేశానని జేడీ ప్రకటించారు.

 

ఇదిలాఉంటే రాజకీయవర్గాల విశ్వసనీయ  సమాచారం ప్రకారం జేడీ కొన్ని నెలలుగా జనసేనలో  జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, పవన్ గతంలో మాదిరిగా కాకుండా నిలకడలేని మాటలు ,మాట్లాడటం నచ్చకపోవడంతో పవన్ కి కొన్ని సూచనలు చేశారని, దాంతో పవన్ జేడీ ని పక్కన పెడుతూ వచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు బీజేపీ తో పొత్తు విషయంలో సైతం పవన్ జేడీని సంప్రదించలేదని దాంతో జేడీ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారని టాక్ కూడా వినిపించింది. ఏది ఏమైనా కీలక సమయంలో జేడీ జనసేనని వీడటం పవన్ కి కోలుకోలేని దెబ్బే అంటున్నారు విశ్లేషకులు.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.